ఇటీవల కాలంలో రోజూ ఎన్నో సినిమాలు, షోలు ఓటీటీల్లో విడుదల అవుతూనే ఉన్నాయి. కానీ, కొన్ని మాత్రమే ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం బెస్ట్ ఓటీటీ మూవీస్‌లో రెండు నెట్‌ఫ్లిక్స్‌లో ఉండగా, ఒకటి మాత్రం జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
వీటి స్టోరీలు అదిరిపోవడంతో పాటు, నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండటంతో OTT ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అవేవో చూసేద్దాం.
పొన్మాన్ (జియోహాట్‌స్టార్)
‘పొన్మాన్’ ఒక మలయాళ థ్రిల్లర్. ఇందులో డార్క్ కామెడీ కూడా ఉంటుంది. ఈ సినిమాలో అజేష్ అనే గోల్డ్ డీలర్ ఉంటాడు. అతను ఊర్లో జరిగే పెళ్లి కోసం 25 సవర్ల బంగారం అప్పుగా ఇస్తాడు. పెళ్లిలో వధువుకి గిఫ్ట్‌లుగా వచ్చే డబ్బులన్నీ తనకే కావాలని కండిషన్ పెడతాడు. కానీ, కథ అడ్డం తిరుగుతుంది. వధువుకు క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న భర్త ఉంటాడు. అతని పేరు మరియానో. అతనికి ఈ బంగారం నచ్చుతుంది. అజేష్‌ని సైలెంట్ చేసేయాలని చూస్తాడు. అక్కడినుండి కథ మొత్తం టర్న్ అవుతుంది.
ఈ సినిమా మెయిన్‌గా మనుషుల ఎమోషన్స్ చూపిస్తుంది. కామెడీతో పాటు సస్పెన్స్ కూడా అదిరిపోతుంది. ఇంటెన్స్ కాన్ఫ్లిక్ట్, నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్. అందుకే ‘పొన్మాన్’ సినిమా చూసేవాళ్లని కట్టిపడేస్తుంది. అసలు ఊహించని ట్విస్టులు, మనుషుల్లో ఉండే అత్యాశని రియాలిటీకి దగ్గరగా చూపించడంతో ఆడియన్స్‌కి ఈ సినిమా బాగా నచ్చేసింది.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ (నెట్‌ఫ్లిక్స్)
కుంచాకో బోబన్ హీరోగా నటించిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ సినిమా మలయాళంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్. జితు అష్రాఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్టోరీ విషయానికొస్తే, ఒకప్పుడు బాగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్.. ఇప్పుడు డీమోట్ అయ్యి (ర్యాంక్ స్థాయి తగ్గడం) ఉంటాడు. అలాంటి టైమ్‌లో అతనికి ఒక చిన్న కేసు వస్తుంది. అదేంటంటే.. నకిలీ గోల్డ్ చైన్ కేసు. చూడటానికి సింపుల్‌గా అనిపించినా, ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాక అసలు విషయం తెలుస్తుంది. టీనేజ్ అమ్మాయిలే టార్గెట్‌గా డ్రగ్స్ అమ్ముతున్న డేంజరస్ గ్యాంగ్ గురించి తెలుస్తుంది. వాళ్ల పగ ఎలా ఉంటుందో కూడా చూపిస్తారు.
సినిమా కొంచెం స్లో అయినట్టు అనిపించినా, టెక్నికల్‌గా మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ముఖ్యంగా జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. ఫైట్ సీన్స్‌లో వచ్చే ఎనర్జిటిక్ EDM ట్రాక్స్ సినిమాకి వేరే లెవెల్ కిక్ ఇస్తాయి. మిడ్-బడ్జెట్ సినిమా అయినా, డైరెక్టర్ టేకింగ్ కానీ, యాక్షన్ సీక్వెన్సులు కానీ చాలా షార్ప్‌గా, గ్రిప్పింగ్‌గా ఉండటంతో ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా.
అడోలెసెన్స్ – నెట్‌ఫ్లిక్స్
‘అడోలెసెన్స్’ నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఒక పవర్‌ఫుల్ మిని-సిరీస్. కేవలం నాలుగు ఎపిసోడ్స్‌తోనే ఇది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. హన్సల్ మెహతా, శేఖర్ కపూర్, అనురాగ్ కశ్యప్ లాంటి టాప్ డైరెక్టర్లు కూడా ఈ సిరీస్‌ను మెచ్చుకున్నారు. స్టోరీలోకి వెళ్తే.. జేమీ మిల్లర్ అనే 13 ఏళ్ల కుర్రాడు ఉంటాడు. అతను తన క్లాస్‌మేట్ కేటీని కత్తితో పొడిచి చంపాడని కేసు పెడతారు. తను చేయలేదని చెప్పినా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మెయిన్ స్టోరీ. ఈ షో కేవలం క్రైమ్ గురించే కాదు, టాక్సిక్ మ్యాస్కులినిటీ, సోషల్ మీడియా ప్రభావం, సైబర్ బుల్లియింగ్ లాంటి విషయాల గురించి కూడా మాట్లాడుతుంది.
ఈ సిరీస్‌ను సింగిల్-షాట్ ఫిల్మింగ్ స్టైల్‌లో తీయడంతో, చూసేవాళ్లు క్యారెక్టర్స్ ఎమోషన్స్‌లోకి ఈజీగా కనెక్ట్ అవుతారు. ఆలోచింపజేసే, సోషల్ మెసేజ్ ఉన్న సిరీస్ చూడాలనుకునే వాళ్లకి ‘అడోలెసెన్స్’ పక్కాగా నచ్చుతుంది.