Connect with us

Andhrapradesh

కొనసాగుతున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.

Published

on

132 Views

ఈ రోజు పరవాడ మండలం రావాడ పంచాయతీ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌ౹౹శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రావాడ పంచాయతీ లో ప్రారంభమైంది., గ్రామానికి విచ్చేసిన సందర్భంగా పరవాడ మండల వైస్ ఎంపీపీ బంధం నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు కోన రామారావు స్వాగతం పలికారు.., ప్రతి గడపకు వెళ్లి వారికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని వివరిస్తూ ప్రతి అవ్వకు ప్రతి అక్కకు చెల్లెమ్మలకు ఉన్న కష్టాలను తెలుసుకోవడం జరిగింది. ఇంట్లో పెద్దవాళ్లకు, వితంతువలు,వికలాంగులకు పెన్షను, ఇంటింటికి రేషన్ బియ్యం పథకం, మహిళామణులకు ఆర్థికాభివృద్ధి, రైతన్నలకు రైతు భరోసా, పిల్లలకు నాణ్యమైన చదువులు, నవరత్నాలు పేదలందరికీ  సొంతిల్లు, డ్వాక్రా రుణాలు, నవరత్నాలు ఇలా ఎన్నింటినో ప్రజలకు అందిస్తూ జగనన్న మనకు అండగా ఉన్నాడని అన్నారు. రావాడ పంచాయతీ పరిధిలో జగనన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుండి మన ప్రభుత్వం నుండి 31 కోట్ల 34 లక్షల రూపాయలు సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలకు అందించడం జరిగిందని తెలిపారు. జగనన్న రాసిన లేఖను చూపిస్తూ నాలుగేళ్ళ లో ఆ కుటుంబానికి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న  సంక్షేమ పథకాలు అందిన తీరును వివరించారు. ఎమ్మెల్యే గారు ప్రతి  కుటుంబంతో మాట్లాడుతూ ఇప్పుడు జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై అభిప్రాయం చెప్పమని కోరారు. దాంతో ఆ కుటుంబమంతా ఎంతో సంతోషంగా జగనన్న చల్లగా ఉండాలని దీవించారు. ఈ రోజున ముఖ్యమంత్రి మన జగనన్న కావడం వల్లే మా జీవితాలు బాగుపడ్డాయని, మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని హర్షాతిరేకాల తో ఆనందంగా తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర CEC సభ్యులు పైల శ్రీనివాసరావు , పరవాడ జడ్పీటీసీ పైల సన్యాసిరాజు మాజీ RECS చైర్మన్ చల్ల కనకరావు, పెందుర్తి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పైల అప్పల నాయుడు, వై.సి.పి నాయకులు కావలి రాజు, అప్పలరాజు, కావలి వాసు, బొద్దపు చిన్నారవు, అశోక్, పల్లా గోవింద్, గంగరాజు, పరవాడ ఎంపీడీఓ హేమ సుందరరావు, EORD రమేష్ నాయుడు, PR AE గండి రామారావు, హోసింగ్ AE రెడ్డి గారు, RWS AE షణ్ముఖ, RECS AE శేష సాయి, APM కనకమ్మ, అగ్రికల్చర్ AO చంద్రవతి, VRO బుజంగ రావు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్ లు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhrapradesh

గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Published

on

23 Views

రైతులకు గిట్టుబాటు ధరల హామీ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి! డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు కాగితాల్లో మాత్రమే మిగిలిపోవాలి కాదు, అమలులోకి రావాలి! జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి!

రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 200 రకాలకుపైగా పంటలు పండితే, కేవలం 20-25 పంటలకే మద్దతు ధర ప్రకటించడం కక్ష సాధింపు చర్య కాదు అంటే ఏమిటి? అదీ కూడా మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చినట్లు నటిస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ మిర్చి ధర ₹17,000 ఉండగా, ప్రభుత్వం ₹11,700 ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఒకరికి రూ. 5,000 కట్ చేసి మరొకరికి వేల కోట్లు మాఫీ చేయడమేనా పాలన?

రైతుల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక రైతులను పక్కన పెట్టే ప్రభుత్వాలను భరించేది లేదు! ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరమే కాదు. రైతుల శ్రమ, కష్టం, కన్నీళ్ల మీద నిర్మించుకున్న భవనాలే కాదా? మద్దతు ధర ఇవ్వకపోతే వ్యవసాయమే క్షీణించిపోతుంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులను మోసం చేసే ముఠాలను అరికట్టాల్సింది పోయి, రైతుల్ని రెక్కల ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారా?

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ క్షమించరు! ప్రభుత్వం గట్టిగా స్పందించకపోతే, రైతు చైతన్య యాత్రలు చేస్తాం, పోరాటాలు మిన్నంటిస్తాం! రైతు సంఘం దీక్షలు, ఉద్యమాలు ఎంత దూరమైనా వెళ్లే వరకు వెనక్కి తగ్గేది లేదు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం నాయకులు కృష్ణ, రవికుమార్, అనుమప్ప, కోదండ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

4o
Continue Reading

Andhrapradesh

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

Published

on

కలెక్టరు రంజిత్ బాషాను కలిసిన వీరభద్ర గౌడ
194 Views

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..

Continue Reading

Andhrapradesh

పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

Published

on

184 Views

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Home
Ap News
Login
Reporters