Andhrapradesh
పోలీసు అమరవీరుల స్ధూపానికి ఘనంగా నివాళులు అర్పించిన … జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజన ఐఏయస్, జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.

దేశ, రాష్ట్ర శాంతి భద్రతల పరిరక్షణలో(01.09.2022 నుండి 31.08.2023) ప్రాణ త్యాగాలు చేసి అమరులైన 188 మంది పోలీసులకు ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్
పోలీసు అమరుల కుటుంబాలకు అండగా నిలవాలి జిల్లా కలెక్టర్ ..

విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన భాద్యత , వారు చేసిన త్యాగాలు, సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజన ఐఏయస్ , జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ లు అన్నారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంధర్బంగా శనివారం స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్ మైదానంలో అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించారు.జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు స్మృతి పరేడ్ కు హజరై, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజన ఐఏయస్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకుంటూ, నివాళులర్పిస్తూ ఈరోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాము.
దేశ సరిహద్దు భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి ముందుండే వారిలో ఆర్మీ తర్వాత పోలీసులేనని, అన్ని వ్యవస్థల కంటే పోలీసు వ్యవస్థలో పని చేయడం చాలా కష్టతరం, 24 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఒక సారి ఖాకీ యూనిఫాం వేసిన తర్వాత కమిట్ మెంట్ దాని అంతట అదే వస్తుందన్నారు.ప్రజల, ధన, మాన , ప్రాణాలను కాపాడడంలో ఏటువంటి సంకోచం లేకుండా పోలీసులు ముందుకు వెళతారని, అటువంటి పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకోవడం, అమరులకు నివాళులు అర్పించడం మనందరి భాధ్యత అన్నారు.
ఎక్కడైనా, ఎప్పుడైనా అసాంఘిక శక్తులు ప్రబలినప్పుడు, ప్రజలకు భద్రత కల్పించడానికి మేము ఉన్నామనే భరోసా పోలీసుల ద్వారా ఏర్పడుతుందన్నారు. దేశ సరిహద్దల్ని ఆర్మీ వారు ఏవిధంగా కాపాడుతున్నారో, దేశంలోని ప్రజలకు ఏటువంటి అసౌకర్యం, అభధ్రత భావం లేకుండా బ్రతకాలంటే ముందుగా భరోసా ఇచ్చేది పోలీసులేనని అన్నారు.
ఆ పోలీసుల త్యాగ నిరతిని ఈ రోజు మనం గుర్తు చేసుకోవాలసిన అవసరం ఉంది, ఆ భాధ్యత మన అందరి పై ఉంది. పోలీసులకు విధి నిర్వహణలో ఏటువంటి ఇబ్బందులు కలిగినా, పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన భాధ్యత పోలీసు వ్యవస్ధ మరియు ప్రభుత్వం పై ఆధార పడి ఉందన్నారు.
జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ మాట్లాడుతూ.1959 అక్టోబరు 21 వ తేదీన భారత్ – చైనా సరిహద్దు లఢఖ్లోని హాట్ స్ప్రింగ్ వద్ద పోలీసు పెట్రోలింగ్ పహారాలో ఉన్నటువంటి 10 మంది CRPF జవానుల పై శత్రువులు దాడి చేయగా, ధైర్యసాహసాలతో వారి పై ప్రతి దాడి చేస్తూ పోరాడి వీరమరణం పొందారు. వారు ఆ రోజు చేసిన అంతిమ త్యాగాలను గుర్తించి , గౌరవించి, దేశ వ్యాప్తంగా అమరవీరుల దినోత్సం ను ఈ రోజు జరుపుకుంటూ అమరవీరులకు శ్రధ్దాంజలి నిర్వహిస్తున్నామన్నారు.
దేశ , రాష్ట్ర భద్రత, ప్రగతి కోసం పోలీసులు పగలనక, రేయనక విధి నిర్వహణలో ప్రాణాలను తృణప్రాయంగా భావించి ప్రజల శ్రేయస్సుకై ప్రాణాత్యాగం చేస్తున్నారు. కోవిడ్ సమయంలో కూడా చాలా మంది పోలీసులు ప్రాణాలను అర్పించారన్నారు. దేశంలో ఏ వ్యవస్థ అయినా విశ్రాంతి తీసుకుంటే వచ్చే నష్టం స్వల్పమేనని, అదే పోలీసు వ్యవస్థ విరామం తీసుకుంటే సమాజంలో అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు పెట్రేగి పోతాయన్నారు.
ఒక సంవత్సర కాలంలో 01.09.2022 నుండి 31.08.2023 నాటికి దేశవ్యాప్తంగా 188 మంది పోలీసులు వీరమరణం పొందారన్నారు.పోలీసుల సంక్షేమం, ఆరోగ్యం సంబంధించి జిల్లా పోలీసు యంత్రాంగం తరపున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. శాంతిభద్రతల పరిరక్షణలో అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళతామన్నారు.అనంతరం దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 188 మంది పోలీసుల పేర్లను ఎఆర్ డిఎస్పీ ఇలియాజ్ భాషా గారు చదివి వినిపించారు.
అందరికి శ్రధ్దాంజలి ఘటిస్తూ, నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ్ ,సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ ఐపిఎస్, హోంగార్డు కమాండెంట్ సదరన్ రీజియన్ ఎం. మహేష్ కుమార్ , అడిషనల్ ఎస్పీ అడ్మిన్ టి. సర్కార్, డిఎస్పీలు సుధాకర్ రెడ్డి, విజయ శేఖర్, నాగభూషణం,శ్రీనివాసులు, ఇలియాజ్ భాషా , పోలీసు వేల్పేర్ డాక్టర్ శ్రీమతి స్రవంతి, సిఐలు, ఆర్ ఐలు, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు పాల్గొన్నారు.

Andhrapradesh
గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Andhrapradesh
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..
Andhrapradesh
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
-
Andhrapradesh1 year ago
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భధ్రత … 1,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.
-
Andhrapradesh1 year ago
పాలస్తీనా పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఖండించండి!!
-
Andhrapradesh1 year ago
అసహనం లో SBI కస్టమర్స్.. నిలిచిన UPI సేవలు.
-
Andhrapradesh1 year ago
సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…
-
Andhrapradesh5 months ago
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..
-
Andhrapradesh5 months ago
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.
-
Telangana1 year ago
దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా
-
Andhrapradesh12 months ago
మండలంలోని సాగునీటి సమస్యలపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలి….సీపీఎం