Special Articles

విమానంలా సౌకర్యంగా ఉండే ఈ కారుకు ఫుల్ డిమాండ్

భారతదేశంలో కార్ల తయారీ దారుల్లో ఎంజీ మోటార్స్ (Mg Motors) ఒక ప్రసిద్ధ కంపెనీ. ఆకట్టుకునే డిజైన్‌తో కార్లను విడుదల చేయడం దీని ప్రత్యేకత. లోకల్‌గా టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ విభాగంలో దూసుకుపోతున్న నేపథ్యంలో వీటికి పోటీగా ఎంజీ సైతం ఈ సెగ్మెంట్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుంది. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే కార్లకు భారతీయ ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ మోడల్ MG విండ్సర్ కారుకు దేశంలో డిమాండ్ బాగా ఉంది. ఇది ఒక ప్రసిద్ధ ఎలక్ట్రిక్ SUV. దీని ఆకర్షణీయమైన డిజైన్, సరికొత్త ఫీచర్స్‌తో చాలా మంది ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇది భారీ సంఖ్యలో అమ్ముడుపోతుంది. దీని లాంచ్ తర్వాత డెలివరీలు మొదలైనప్పటి నుంచి ప్రతి నెలా సగటున 3,000 కార్ల సేల్స్ జరుగుతూనే ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో కొత్త MG విండ్సర్ ఈవీ డెలివరీలు 2024 అక్టోబర్ నెలలో మొదలయ్యాయి. అప్పటి నుంచి ప్రతి నెల అమ్మకాలను పెంచుకుంటూనే ఉంది. కస్టమర్ల నుంచి బుకింగ్ ఎక్కువగా రావడంతో దీని డెలివరీలు ఇప్పుడు మరింత ఆలస్యం కానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త MG విండ్సర్ EVని బుకింగ్ చేసుకున్నట్లియితే ఇది మీ వద్దకు చేరడానికి దాదాపు 2 నెలలు వెయిట్ చేయాల్సిందే. ఇది నగరాలను బట్టి మారుతుంది.

దేశరాజధాని ఢిల్లీలో ఈ ప్రసిద్ధ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెలివరీకి 1-2 నెలల సమయం పడుతుంది. అదే విధంగా బెంగళూరులో వెయిటింగ్ పీరియడ్ 1.5 నుంచి 2 నెలల వరకు ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో బుకింగ్ చేసుకున్న కస్టమర్లు ఈ కారును తమ చేతుల్లోకి తీసుకోవడానికి 1.5 నుండి 2 నెలలు ఆగాల్సిందే. నోయిడాలో 1.5 నెలలు, పూణేలో 2 నెలలు, చెన్నైలో 2 నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉంది. కొత్త MG విండ్సర్ ఈవీ విషయానికి వస్తే, ఇది భారతీయ మార్కెట్లో ప్రారంభ ధర రూ.14 లక్షల నుంచి టాప్ వేరియంట్ రూ.16 లక్షల వరకు కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంది. దీని ఎక్స్‌టీరియర్‌తో పాటు ఇంటీరియర్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 5 సీటర్ ఆప్షన్‌లో ఈ కారు లభిస్తుంది.

ఇది స్టార్‌బర్స్ట్ బ్లాక్, పెర్ల్ వైట్, క్లే బీజ్ కలర్స్‌ను కలిగి ఉంటుంది. 38 కిలోవాట్(kWh) కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్‌ను దీనిలో అమర్చారు. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే 331 కిలోమీటర్లు ఛార్జింగ్ కోసం ఎక్కడా ఆపనవసరం లేకుండా రయ్ మంటూ దూసుకెళ్లవచ్చు. ప్రయాణికులకు, డ్రైవర్‌కు అవసరమైన అన్ని ఆప్షన్స్ ఈ కారులో ఉన్నాయి. ఇది ఎకో, ఎకో ప్లస్, నార్మల్, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్స్‌ను కలిగి ఉంది. ఇంటీరియర్‌లో ఉన్నటువంటి ఫీచర్స్ విషయానికి వస్తే, 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 604 లీటర్ల బూట్ స్పేస్‌, ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగులు,TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ESC,360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.

Related posts

Ugadi 2025: ఉగాది పండుగ ఎప్పుడు ప్రారంభమైంది

Xloro News

ఆధ్యాత్మికం: గుడిలో ధ్వజ స్థంభానికి ఎందుకు నమస్కారం చేయాలి

Xloro News

Chanakya Niti: ఈ లక్షణాలు ఉంటే లక్షల్లో జీతం వచ్చినా అప్పులు తిప్పలే..

Xloro News

Leave a Comment