Sports

ఐపీఎల్ ప్రారంభానికి ముందే జియో తన వినియోగదారులకు తీపి వార్త చెప్పింది.

మ‌రో ఐదు రోజుల్లో ఇండియ‌న్ ప్రీమియం లీగ్ ప్రారంభం
యూజ‌ర్లు రూ. 299 అంత‌కంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే జియోహాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ
90 రోజుల పాటు ఉచితంగా జియోహాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను పొంద‌వ‌చ్చ‌ని వెల్ల‌డి
ఇంత‌కుముందు మ్యాచ్‌ల‌ను వీక్షించాలంటే వినియోగ‌దారులు క‌నీస స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవాల‌నే ష‌ర‌తు

మ‌రో ఐదు రోజుల్లో ఇండియ‌న్ ప్రీమియం లీగ్ (ఐపీఎల్)కు తెర‌లేవ‌నుంది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న ఈ మెగా ఈవెంట్‌ను డిజిట‌ల్ వేదిక‌గా జియో ప్రసారం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే, ఇన్నాళ్లు ఉచితంగా వీక్షించిన ఫ్యాన్స్‌కు హాట్‌స్టార్‌తో విలీనం రూపంలో జియో షాకిచ్చింది. మ్యాచ్‌ల‌ను వీక్షించాలంటే వినియోగ‌దారులు క‌నీస స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవాల‌నే ష‌ర‌తు పెట్టింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా త‌న వినియోగ‌దారుల‌కు జియో తీపి క‌బురు చెప్పింది. ఎంపిక చేసిన కొన్ని రీఛార్జ్ ప్లాన్ల‌పై జియో యూజ‌ర్లు 90 రోజుల పాటు ఉచితంగా జియోహాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను పొంద‌వ‌చ్చ‌ని వెల్ల‌డించింది. వినియోగ‌దారులు రూ. 299 అంత‌కంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే జియోహాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఫ్రీగా పొంద‌వ‌చ్చు. దీంతో క్రికెట్ అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Related posts

Cricket Stadium: ‘మోదీ’కి చంద్రబాబు ఝలక్‌.. ఏపీ రాజధానిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం

Xloro News

Leave a Comment