Health

ఉసిరి : దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఉసిరిని ( Amla) ఔషధ గుణాల సిరి, ఆరోగ్య సిరి అని పిలుస్తారు. ప్రకృతిపరంగా సహజ సిద్ధంగా లభించే వాటిలో ఉసిరి ఒకటి. ఇవి కూడా సీజన్‌ పరంగానే లభిస్తాయి.

ఉసిరికాయలు బీపీ, షుగర్‌ తదితర దీర్ఘకాలిక వ్యాధులకు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. సన్న నిమ్మ, చీని, మామిడి, సపోటా, సీతాఫలం తరహాలోనే ఉసిరి కూడా రైతుకు కొన్నేళ్లపాటు ఆదాయాన్ని అందిస్తాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఉసిరి ప్రయోజనాలు(​Helath benifits) తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఉసిరి(Indian gooseberry) ముసలితనాన్ని నిరోధించడంలోనూ, శక్తివంతులుగా చేయడంలో దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక రకమైన ఎలర్జీతో సతమత మవుతుంటారు. కాలుష్య ప్రభావంతో 30% ఏదో రకమైన ఎలర్జీతో బాధపడుతుంటారు. ఈ ఎలర్జీ ఆస్త్మా రూపంలో ఉంటుంది. ఎలర్జీ నుండి రక్షణ కల్పించడంలో ఉసిరికాయ ఎంతో దోహదపడుతుంది. ఉసిరి ఫంగస్‌ నిరోధకంగా రక్తనాళాలలో కలిగే ఫ్లేక్‌ నిరోధకంగా, క్యాన్సర్‌ నిరోధకంగా జీవకణాల్లో డీఎన్‌ఏకు పెంచడం ద్వారా రోగ నిరోధకంగా పనిచేస్తుంది. మనకు లభించే ఆహార పదార్థాలన్నింటిలో అత్యద్భుతమైన యాంటీ యాక్సిడెంట్‌ గుణాలు పదార్థం కలిగి ఉంటుంది. శరీరంలో నిరంతరం జరిగే జీవ ప్రక్రియతోపాటు కాలుష్యంవల్ల శరీరంలో కణాల మధ్య జరిగే నష్టాన్ని నివారించడంలో చక్కటి పాత్ర పోషిస్తుంది.

అనారోగ్యాన్ని కలిగించే కణ విభజనను ఉసిరి నివారిస్తుంది. ఉసిరికాయ నిజానికి అద్భుతమైన ఫలంగానే భావించాలి. సూపర్‌ ఫుడ్‌గా పరిగణించే పసుపు కంటే ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు రెండు రెట్లు అధికంగా ఉంటాయి. ఉసిరిలో దానిమ్మకాయ కంటే 60 రెట్లు అధికంగా ఉంటాయి. ఉసిరిలో శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్‌ సి కలిగి ఉండి కమజాలాన్ని కలిపి ఉంచే పునరుత్పత్తి చేయడం ద్వారా కీళ్ల నొప్పుల నుంచి, చర్మవ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇలా ఉసిరికాయలో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని పచ్చళ్ళుగా( ఊరగాయ) తయారు చేసుకుని ఎంచక్కా ఆరగించే అవకాశం ఉంది. వీటిని నిల్వ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ ఉసిరి చెట్టును చాలామంది ఇంటి పెరటి భాగంలో పెంపకం చేపడుతారు.

Related posts

ఈ పండు గుండె జబ్బులకు దేవుడిచ్చిన వరం

Xloro News

పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకోవాలంటే ఇలా చేయాలట.. డాక్టర్ చెప్పిన ట్రిక్‌

Xloro News

ఉదయాన్నే రాగిజావ తాగితే ఏమవుతుందో మీకు తెలుసా

Xloro News

Leave a Comment