హీరో నితిన్(Hero Nithin) చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు ‘రాబిన్ హుడ్’ చిత్రం(Robinhood Movie) ద్వారా మన ముందుకు ఈ నెల 28న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత నితిన్ చేస్తున్న చిత్రమిది. శ్రీలీల(Srileela) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad), వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విడుదలైన పాటలకు, టీజర్ కు పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ రీసెంట్ గా విడుదలైన ‘అది దా సర్ప్రైజ్’ పాట మాత్రం సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ చిత్రం పై ఒక సెక్షన్ ఆడియన్స్ లో కాస్తో కూస్తో థియేటర్ కి వెళ్లి చూడాలి అనే ఆసక్తి కలిగించడం లో పాట ఒక కారణం అయితే, ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) మరో ముఖ్య కారణం.
మన ఇండియన్ సినిమాలంటే మొదటి నుండి ఎంతో ఆసక్తి చూపిస్తూ వచ్చిన డేవిడ్ వార్నర్, ఇది వరకే మనకు సోషల్ మీడియాలో వివిధ సినిమాలకు సంబంధించిన గెటప్స్ వేసి మన ఆడియన్స్ ని ఇన్ స్టాగ్రామ్ రీల్స్ రూపం లో అలరించాడు. నేటి తరం యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న క్రికెటర్, పైగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరుపున ఆడి, ఆ టీం కి ప్రాతినిధ్యం వహించి రెండు సార్లు ట్రోఫీ ని తీసుకొచ్చిన లెజెండ్ కావడంతో వార్నర్ పై మన తెలుగు ఆడియన్స్ ఎంతో ప్రేమ. అలాంటి వార్నర్ పై సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి వార్నర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.
ఆయన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘డేవిడ్ వార్నర్ గాడిని పట్టుకొచ్చారు..ఈ డేవిడ్ వార్నర్ ని క్రికెట్ ఆడమంటే పనికిమాలిన స్టెప్స్ వేస్తుంటాడు(పుష్ప డ్యాన్స్ ని ఇమిటేట్ చేస్తూ). దొంగ ముం***కు మామూలోడు కాదండి వీడు.రేయ్ వార్నర్..ఇది నా వార్నింగ్’ అంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. వార్నర్ కి తెలుగు రాదు కాబట్టి పాపం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడే మాటలకు నవ్వుతూ ముఖం పెట్టాడు. ఎవరైన ఆయనకు అర్థం అయ్యేలా రాజేంద్ర ప్రసాద్ ఏమి మాట్లాడాడో వివరిస్తే రియాక్షన్ అలా ఉండేది కాదేమో. అయినా రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఇలా మాట్లాడాడు?, ఆయన మాట తీరులో కూడా చాలా తేడా ఉంది. మందు త్రాగి ఈవెంట్ కి వచ్చాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా ఒక అతిథి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజేంద్ర ప్రసాద్ స్థాయికి ఏమాత్రం సరిపోదు. ఆయన మాట్లాడిన వీడియో ని మీరు కూడా చూసేయండి.