ఏపీలో ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్‌శాఖ నిర్ణయం తీసుకుంది.
ఈ నెలాఖరు వరకు పెండింగ్‌లో ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ మంగళవారం జీవో జారీ చేసింది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పేరుకు పోయిన కోట్లాది రూపాయల ఆస్తి పన్ను బకాయిల వసూళ్ల కోసం వడ్డీ రాయితీ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.