భారత్‌లో లావా షార్క్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఏఐ సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెన్సార్‌తో ఈ మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. 8జీబీ డైనమిక్ ర్యామ్‌తో, Unisoc T606 చిప్‌సెట్‌తో దీన్ని విడుదల చేశారు.
5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఇది యూజర్లను ఆకర్షిస్తోంది.
ఏఐ ఇమేజింగ్ ఫీచర్‌లతో ఫేస్ అన్‌లాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ఉన్నాయి. లావా షార్క్ ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
దేశంలో లావా షార్క్ ధర రూ.6,999. ఏడాది పాటు వారంటీ, ఫ్రీ సర్వీస్ అట్ హోమ్‌ను కూడా అందిస్తోంది. ప్రస్తుతం దేశంలోని లావా రిటైల్ దుకాణాల్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్టీల్త్ బ్లాక్, టైటానియం గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
లావా షార్క్ ఫీచర్లు
లావా షార్క్ 120Hz రిఫ్రెష్ రేట్, 269ppi పిక్సెల్ డెన్సిటీతో వచ్చింది. 6.7-అంగుళాల HD+ (720 x 1,612 పిక్సెల్స్) స్క్రీన్‌తో దీన్ని విడుదల చేశారు. 4జీబీ ర్యామ్, 64 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ Unisoc T606 SoC ఇందులో ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 14 OSతో మార్కెట్లోకి వచ్చింది.
కెమెరా విషయానికి వస్తే లావా షార్క్ 50-మెగాపిక్సెల్ ఏఐ-బ్యాక్డ్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు వెనుక భాగంలో ఎల్‌ఈడీ ఫ్లాష్ యూనిట్, ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో వచ్చింది.
లావా షార్క్ 5,000mAh బ్యాటరీతో యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ద్వారా 18డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో విడుదలైంది. 158 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. IP54 డస్ట్, స్ప్లాష్-రెసిస్టెంట్ బిల్డ్ ఇందులో ఉన్నాయి.