Business

లక్షకు అదిరిపోయే వడ్డీ.. ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కిం ఇదే

డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంది స్టాక్ మార్కెట్ కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)ని ఇష్టపడతారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఉండే హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా FD పెట్టుబడిదారులకు స్థిరమైన రాబడిని అందిస్తుంది.

అయితే బ్యాంకులు కాలానుగుణంగా ప్రత్యేక FDలను ప్రవేశపెడతాయి. వీటిలో సాధారణ FDలతో పోలిస్తే రాబడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో కూడా ఇలాంటి రెండు ప్రత్యేక FDలు ఉన్నాయి. వీటిలో 7.75% వరకు వడ్డీ వస్తుంది. మీరు వీటిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే చివరి తేదీ మార్చి 31.

SBI ఈ రెండు ప్రత్యేక FDల పేర్లు SBI అమృత్ వృష్టి అండ్ SBI అమృత్ కలష్. నిజానికి SBI వివిధ రకాల పెట్టుబడిదారుల కోసం ఎన్నో ప్రత్యేక FD పథకాలను నిర్వహిస్తుంది. ఈ FD పథకాలు వివిధ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక FDలో పెట్టుబడి ఒక నిర్ణీత కాలానికి మాత్రమే చేయబడుతుంది. ఆ తరువాత ఈ స్కీమ్స్ ముగుస్తాయి.

1. SBI అమృత్ వృష్టి: SBI అమృత్ వృష్టి అనేది 444 రోజుల కాలానికి ఒక ప్రత్యేక FD పథకం. ఈ పథకంలో సామాన్యులకు ఏడాదికి 7.25% వడ్డీ లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ లభిస్తుంది. మీరు ఈ FD పథకంలో 31 మార్చి 2025 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

మీకు ఎంత రిటర్న్ వస్తుందంటే : మీరు ఈ పథకంలో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే, 444 రోజుల తర్వాత అంటే మెచూరిటీ తర్వాత ఈ మొత్తం రూ.1,09,266కి పెరుగుతుంది. అంటే మీకు వడ్డీగా రూ.9266 లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు రూ.109936 లభిస్తుంది. మరోవైపు మీరు ఇందులో రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే మెచూరిటీ నాటికి ఈ మొత్తం రూ.2,18,532కి పెరుగుతుంది. అంటే మీకు వడ్డీగా రూ.18,532 లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు మెచూరిటీ సమయంలో రూ. 2,19,859 పొందుతారు.

2. SBI అమృత్ కలష్: SBI అమృత్ కలష్ అనేది 400 రోజుల కాలానికి మరొక ప్రత్యేక FD పథకం. ఈ పథకంలో 7.10% వార్షిక వడ్డీ లభిస్తుంది. ఈ FD పథకంలో సీనియర్ సిటిజన్లకు 7.60% వడ్డీ అందిస్తుండగా, మీరు మార్చి 31 వరకు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు.

మీకు ఎంత రిటర్న్ వస్తుందంటే : మీరు ఈ పథకంలో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, 400 రోజుల తర్వాత అంటే మెచూరిటీ తర్వాత ఈ మొత్తం రూ. 1,07,781కి పెరుగుతుంది. అంటే మీకు వడ్డీగా రూ.7781 వస్తుంది. సీనియర్ సిటిజన్లకు రూ.1,08,329 లభిస్తుంది. మరోవైపు, మీరు ఇందులో రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే మెచూరిటీ నాటికి ఈ మొత్తం రూ. 2,15,562కి పెరుగుతుంది. అంటే మీకు వడ్డీగా రూ.15,562 వస్తుంది. సీనియర్ సిటిజన్లకి మెచూరిటీ సమయంలో రూ.2,16,658 పొందుతారు.

మీరు ఎలా పెట్టుబడి పెట్టాలంటే: ఈ FDలలో పెట్టుబడి పెట్టడానికి మీరు అవసరమైన డాకుమెంట్స్ తీసుకొని మీ సమీపంలోని SBI బ్రాంచుకి వెళ్లాలి. మీకు SBIలో బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు ఆన్‌లైన్‌లో కూడా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఈ FDలలో పెట్టుబడికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా SBI YONO యాప్ ద్వారా కూడా ప్రారంభించవచ్చు.

Related posts

₹50,000 పెట్టుబడి.. ₹5 లక్షల లాభం… ఈ సులభమైన సేంద్రీయ వ్యవసాయం

Xloro News

SBI : ఎస్‌బీఐ నుంచి మరో 2 కొత్త పథకాలు

Xloro News

ఇంకా 11 రోజులు మాత్రమే… ₹1.5 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం మిస్ అవ్వకండి…

Xloro News

Leave a Comment