Andhra pradesh

ఏపీలో ఉగాది నుంచి కొత్త పథకం.. ఏంటీ P4, ఎవరికి ప్రయోజనం, లక్ష్యం ఏంటి

ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టబోతున్న పీ4 విధానాన్ని ఉగాది పండగ రోజున ప్రారంభించబోతోంది.

వెలగపూడిలోని సచివాలయం వెనక భాగంలో భారీ సభ ద్వారా ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందుకు భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

పీ4 విధానం ప్రారంభ సభకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పేదలను ఆహ్వానిస్తున్నారు. దాదాపు వెయ్యి మంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు. 2029 నాటికి ఏపీలో పేదరికం నిర్మూలించాలి అనేదే సంకల్పంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో ఏపీలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పీ4 విధానం అమలు చేయాలని నిర్ణయించారు.

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. మరో పదిరోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్

సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10శాతం మంది ధనికులు అట్టడుగున ఉన్న 20శాతం మంది పేదలను దత్తత తీసుకోవడంతో పాటుగా వారికి అండగా ఉంటూ పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేయడమే ఈ కార్యక్రమం అసలు లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలకు అండగా నిలిచేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు చంద్రబాబు.

పీ4 అమల్లో భాగంగా తొలుత గ్రామ, వార్డు సభల ద్వారా ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేలో అత్యంత పేదల వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే ఈ సర్వే అంతిమ దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ పీ4 విధానంలో లబ్ది పొందే కుటుంబాల జాబితాను ప్రభుత్వం రూపొందించబోతోంది. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరబోతోంది. పీ4 విధానంలో భాగస్వాములు కావడానికి ఎన్ఆర్ఐలతో సహా ఎవరైనా స్వచ్చందంగా ముందుకు రావొచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఈ విధానం అమలు ప్రక్రియలో అండగా నిలిచే వారికి మార్గదర్శక లబ్ది పొందే కుటుంబాలను బంగారు కుటుంబాలుగా వ్యవహరిస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు.

సమాజంలో ఉన్న ప్రజల ఆర్థిక అసమానతలను రూపుమాపటం కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఉగాది పర్వదినాన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. పీ4 విధానం పబ్లిక్- ప్రైవేట్- పీపుల్ పార్టనర్ షిప్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

సమాజంలో ఉన్న 10శాతం మంది అత్యంత ధనవంతులు.. 20శాతం మంది నిరుపేదలు.. వీరందరినీ సమన్వయం చేస్తూ పీ4 విధానాన్ని ప్రారంభించి దాన్ని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. ముందుగా రాష్ట్రంలో నాలుగు మండలాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. తర్వాత దశలవారిగా విస్తరించటం ద్వారా ప్రజల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను నిరోధించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

ఏంటీ పీ-4? ఎవరికి ఎలాంటి ప్రయోజనం కలగనుంది..
* ఉగాది రోజున పీ4 విధానం అధికారిక ప్రారంభం
* భారీ బహిరంగ సభ ద్వారా పీ-4 విధానం ప్రారంభం
* 2029లోగా ఏపీలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పీ-4 అమలు
* పేదలను దత్తత తీసుకోనున్న సంపన్నులు
* తొలుత గ్రామ, వార్డు స్థాయిలో అమలు
* తొలి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం
* ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం
* ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం సమృద్ధికి దారి
* ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా స్వావలంబిగా మార్చేలా పీ4 విధానం

Related posts

Sachivalayam Employees: సచివాలయ ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.. ఇక వారి దశ తిరిగినట్లే?

Xloro News

ఏపీలో బీసీ, ఈబీసీ కార్పోరేషన్ లోన్లు

Xloro News

ఏపీలో విద్యార్ధులకు నారా లోకేష్ అదిరిపోయే న్యూస్.

Xloro News

Leave a Comment