భారతదేశం తన మొట్టమొదటి స్వదేశీ MRI (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్) మెషీన్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని దిల్లీలోని AIIMS (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో ఇన్స్టాల్ చేసి అక్టోబర్ 2025 నుంచి ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ స్వదేశీ యంత్రం చికిత్స ఖర్చులను తగ్గించడంలో, దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలపై ఆధారపడటాన్ని 80-85 శాతం నుంచి తగ్గించడంలో సహాయపడుతుంది.
మెడికల్ టెక్నాలజీలో భారత్ స్వయం సమృద్ధి: భారతదేశాన్ని వైద్య సాంకేతిక పరిజ్ఞానంలో స్వావలంబన చేయడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. దీనితో పాటు 1.5 టెస్లా MRI స్కానర్‌ను ఏర్పాటు చేసేందుకు SAMEER (సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్), AIIMS మధ్య ఒక అవగాహన ఒప్పందం (MoU)లో భాగంగా సంతకం చేయడం కూడా జరిగింది.
“భారతదేశంలో క్రిటికల్ కేర్, పోస్ట్-ఆపరేటివ్ కేర్, ICU, రోబోటిక్స్ అండ్ MRI వంటి రంగాలలో చాలా డివైజ్‌లో దిగుమతి చేసుకున్నవే. వాటిలో అధిక-నాణ్యత పరికరాలు 80 నుంచి 90 శాతం వరకు దిగుమతి చేసుకున్నాం. మన దేశంలో ది బెస్ట్ ఇంటెలిజెన్స్ ఉంది. మనం కూడా ప్రపంచంలోనే అత్యుత్తమ పరికరాలను కోరుకుంటున్నాము. ఎయిమ్స్ ఈ లక్ష్యం కోసం పనిచేస్తోంది. అయితే ఇప్పుడు మనం ఈ పరికరాలను భారతదేశంలోనే ఎందుకు తయారు చేయలేం? అని ఆలోచిస్తున్నాం. ఇది స్వావలంబన భారతదేశం వైపు ఒక ముఖ్యమైన అడుగు.”
రెండు ముఖ్యమైన వైద్య సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి: ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY).. SAMEER ద్వారా రెండు ముఖ్యమైన మెడికల్ టెక్నాలజీలను అభివృద్ధి చేసింది. అవి 1.5 టెస్లా MRI స్కానర్, 6 MEV లీనియర్ యాక్సిలరేటర్ (LINAC). ఇది C-DAC (త్రివేండ్రం, కోల్‌కతా), ఇంటర్ యూనివర్శిటీ యాక్సిలరేటర్ సెంటర్ (IUAC), దయానంద్ సాగర్ ఇన్స్టిట్యూట్ (DSI) లతో కలిసి పనిచేస్తుంది.
ఇకపోతే ఈ మెడికల్ టెక్నాలజీలలో MRI స్కానర్ అనేది మృదు కణజాలాలను పరిశీలించేందుకు ఉపయోగించే ఒక మెషీన్. అయితే LINAC అనేది హై-ఎనర్జీ X- కిరణాలు లేదా ఎలక్ట్రాన్లను ఉపయోగించి క్యాన్సర్‌కు చికిత్స చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ చర్యలతో భారతదేశం దిగుమతి ఎంపికలను తగ్గించడంలో ముందుకు సాగుతోంది. ఈ రెండు ప్రాజెక్టులకు MeitY నుంచి ఆర్థిక సహాయం కూడా లభించింది.