Connect with us

Andhrapradesh

జిల్లాను కరువు జిల్లా గా ప్రకటించి రైతులను ఆదుకోండి..

Published

on

135 Views

కరువు పై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం..

జిల్లా ను కరువు జిల్లాగా ప్రకటించకపోతే ఆందోళన తీవ్ర తరం చేస్తాం..

దేవనకొండ టర్నింగ్ లో రైతు ,వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గంటకు పైగా రోడ్డు దిగ్బంధన కార్యక్రమం..

అధికారుల హామీతో దిగ్బంధన కార్యక్రమం విరమణ..

కర్నూలు జిల్లా ను కరువు జిల్లా గా ప్రకటించి రైతులను ఆదుకోవాలని,జిల్లాకు ముఖ్యమంత్రి గారు వచ్చిన రైతాంగానికి భరోసా లేకుండా మొక్కుబడి కార్యక్రమాలు చేసి వెళ్లిపోవడం బాధాకరమని జిల్లా పశ్చిమ ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడి వేలాది కుటుంబాలు బతుకుతున్నాయని వారిని ఆదుకునేందుకు జిల్లాని కరువు జిల్లా గా ప్రకటించి ప్రజానీకాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీర శేఖర్ లు డిమాండ్ చేశారు.


శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం,వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన దేవనకొండ టర్నింగ్ నందు రోడ్డు దిగ్బంధన కార్యక్రమాన్ని చేపట్టారు భారీ సంఖ్యలో వచ్చిన రైతు, వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు రైతుల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది జిల్లాను కరువు జిల్లా గా ప్రకటించాలని, రైతుల బ్యాంకుల మరియు అన్ని రకాల రుణాలు మాఫీ చేయాలని, నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల రూపాయల నుండి 50 వేల వరకు నష్టపరిహారం చెల్లించాలని, వాతావరణ బీమా పరిహారము ఇవ్వాలని, బోర్ల కింద బావుల కింద వేసిన పంటలకు 9 గంటల విద్యుత్ ఇవ్వాలని, ఉపాధి హామీ పనులు అడిగిన వారందరికీ పని కల్పించి వలసలు ఆపాలని , పెద్ద పెట్టున నినాదాలు చేశారు దాదాపు గంటసేపు కు పైగా రోడ్డు దిబ్బందనం చేశారు.

గంటసేపు రోడ్డు దిగ్బంధనం చేసినప్పటికీ ప్రయాణికుల నుండి వ్యతిరేకత రాకపోగా బస్సులలో నుండి దిగివచ్చి ఆందోళన చేస్తున్న రైతు ,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులకు సంఘీభావం తెలపడం విశేషం.ఆర్డీవో వచ్చి హామీ ఇవ్వాలా అని అన్నప్పుడు ప్రయాణికులు కూడా స్వరం కలిపారు దేవనకొండ తాసిల్దారు వెంకటేష్ నాయక్ వాహనాల రాకపోకలు ఆగిపోగా అందులో ఆయన వాహనం కూడా ఇరుక్కుపోయి అక్కడే ఆగిపోయారు ఆందోళన శాంతియుతంగా జరిగింది.


ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సూరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో. రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు G.రామకృష్ణ వీరశేఖర్, రంగారెడ్డి, పి హనుమంతు, బాలకృష్ణ లు మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులవల్ల కరువు తీవ్రత చాలా విపరీతంగా ఉందని ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో పట్టుమని పది రోజులు కూడా వర్షం వచ్చిన దాఖలాలు లేవని పత్తి, ఉల్లి ,వేరుశనగ ,కంది ,ఆముదము సద్దలు, మిరపటమేటా వంటి పంటలకు వేలకు వేల పెట్టుబడులు పెట్టి వ్యవసాయాన్ని చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎండిపోయిన పంటలను పీకి వేసిన పరిస్థితి ఉంది. గత సంవత్సరం ఈ సంవత్సరం వెక్కిరిస్తున్న కరువు వల్ల రైతుల తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నారని నష్టపోయారని ప్రభుత్వం రైతులను ఆదుకునే నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

జిల్లాను కరువు జిల్లా గా ప్రకటించి ఎకరాకు 30 వేల పరిహారం ఇవ్వాలని, బ్యాంకులలో వ్యవసాయంపై తీసుకున్న అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి గత రెండు నెలల కాలంలో ఉమ్మడి జిల్లాలో రెండు సార్లు పర్యటన చేశారని అయినా కరువు పై మాట్లాడకపోవడం చాలా దారుణమని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వామపక్ష ప్రజాసంఘాల నాయకులు అరెస్ట్ చేయడం తప్ప ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు జిల్లాలో ఉన్న తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యం జిల్లా పశ్చిమ ప్రాంతం మీద తీవ్ర ప్రభావం చూపి రోజుకు వందలాదిమంది పొట్ట చేత్తో పట్టుకుని బతుకు జీవుడా అంటూ బ్రతకడానికి వలస వెళుతున్నారని, వలసలు అరికట్టే చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోకపోవడం దారుణం పేర్కొన్నారు.

కరువు పై వెంటనే ప్రభుత్వం ప్రకటన చేయాలని అదేవిధంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించి కరువు పై తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు ఒకవైపు కరువు అరకొరగా పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వలన టమోటా ఇతర వాణిజ్య పంటలు వేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా రైతులకు 9 గంటలు విద్యుత్ ఇస్తున్నామన్న ప్రభుత్వం కేవలం ఐదు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తుందని దీనివలన పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు వ్యవసాయానికి 9 గంటల నిరంతరాయ విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరువు నేపథ్యంలో పశువులకు పశుగ్రాసం ఉచితంగా సరఫరా చేయాలని, వలసల నివారణకు అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు జిల్లాను కరువు జిల్లా గా ప్రకటించకపోతే ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు.

ఆర్డీవో రావాలని ,హామీ ఇవ్వాలని నాయకుల పట్టు బట్టారు.

రోడ్డు దిగ్బంధన కార్యక్రమం నేపథ్యంలో పత్తికొండ ఆర్డిఓ వచ్చి కరువు పై స్పష్టమైన ప్రకటన చేసి హామీ ఇచ్చిన తర్వాతనే దిగ్బంధన కార్యక్రమం విరమిస్తామని రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు స్పష్టం చేసిన నేపథ్యంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది, అక్కడే ఉన్న తాసిల్దారు వెంకటేష్ నాయక్ వచ్చి ఫోన్లో ఆర్డిఓ తో నాయకులతో మాట్లాడించిన ఆర్డీవో హామీ మేరకు అదేవిధంగా వ్యవసాయ అధికారి ,విద్యుత్ ఏ ఇ, దేవనకొండ ఎస్సై భూపాలుడు ల ,హామీతో ధర్నా కార్యక్రమాన్ని విరమించి రాస్తారోకో కార్యక్రమాన్ని విరమించారు.


ఈ కార్యక్రమంలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు తుగ్గలి శ్రీరాములు,రంగస్వామి, ఆస్పరి రంగస్వామి, రామాంజనేయులు దేవనకొండ మండల నాయకులు నాగేష్, మహబూబ్ బాషా, బజారి, తెర్నేకల్లు శ్రీరాములు, బడే సాబ్, లింగన్న ,సుధాకర్, సుంకన్న ,డివైఎఫ్ఐ మండల కార్యదర్శి శ్రీనివాసులు, వీరేంద్ర, రసూల్ ,పల్లె దొడ్డి నాగేష్, రమేష్ ,రాయుడు, మహేంద్ర, బలరాముడు, బండ్లయ్య తో పాటు వందలాదిమంది రైతులు పాల్గొన్నారు.

Andhrapradesh

గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Published

on

23 Views

రైతులకు గిట్టుబాటు ధరల హామీ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి! డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు కాగితాల్లో మాత్రమే మిగిలిపోవాలి కాదు, అమలులోకి రావాలి! జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి!

రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 200 రకాలకుపైగా పంటలు పండితే, కేవలం 20-25 పంటలకే మద్దతు ధర ప్రకటించడం కక్ష సాధింపు చర్య కాదు అంటే ఏమిటి? అదీ కూడా మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చినట్లు నటిస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ మిర్చి ధర ₹17,000 ఉండగా, ప్రభుత్వం ₹11,700 ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఒకరికి రూ. 5,000 కట్ చేసి మరొకరికి వేల కోట్లు మాఫీ చేయడమేనా పాలన?

రైతుల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక రైతులను పక్కన పెట్టే ప్రభుత్వాలను భరించేది లేదు! ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరమే కాదు. రైతుల శ్రమ, కష్టం, కన్నీళ్ల మీద నిర్మించుకున్న భవనాలే కాదా? మద్దతు ధర ఇవ్వకపోతే వ్యవసాయమే క్షీణించిపోతుంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులను మోసం చేసే ముఠాలను అరికట్టాల్సింది పోయి, రైతుల్ని రెక్కల ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారా?

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ క్షమించరు! ప్రభుత్వం గట్టిగా స్పందించకపోతే, రైతు చైతన్య యాత్రలు చేస్తాం, పోరాటాలు మిన్నంటిస్తాం! రైతు సంఘం దీక్షలు, ఉద్యమాలు ఎంత దూరమైనా వెళ్లే వరకు వెనక్కి తగ్గేది లేదు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం నాయకులు కృష్ణ, రవికుమార్, అనుమప్ప, కోదండ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

4o
Continue Reading

Andhrapradesh

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

Published

on

కలెక్టరు రంజిత్ బాషాను కలిసిన వీరభద్ర గౌడ
194 Views

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..

Continue Reading

Andhrapradesh

పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

Published

on

184 Views

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Home
Ap News
Login
Reporters