బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ కార్ ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి వచ్చిన ఓ బస్సు ఆమె కారును ఢీకొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనితో ఐశ్వర్య అభిమానులు తీవ్ర ఆందోళనకు గురైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐశ్వర్య లేరని తెలుస్తోంది. అంతేకాదు ఆమె కారుకు కూడా పెద్ద ప్రమాదమేదీ జరగలేదని ఐశ్వర్య రాయ్ టీమ్ మీడియాకు తెలిపింది.
