Bhakthi - Vastu

Srisailam:శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్

 శ్రీశైలం(Srisailam) మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి నిత్యం వందల మంది భక్తులు(Devotees) వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి వచ్చే భక్తులు వసతి కోసం శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తారు.

దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది కేటుగాళ్లు శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో శ్రీశైల మల్లన్న భక్తులు పలువురు ఈ మధ్య నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవడంతో ఆలయం ఈవో శ్రీనివాసరావు(EO Srinivasa Rao) పలు సూచనలు చేశారు. శ్రీశైలం భక్తులు వసతి, దర్శనం, ఆర్జిత సేవల టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకోవాలని తెలిపారు. www.srisailamdevasthanam.orgwww.aptemples.ap.gov.in దేవస్థానం, దేవాదాయ శాఖ వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలన్నారు. దేవస్థానం వివరాలకు 8333901351, 52, 53 నంబర్లను సంప్రదించాలని సూచించారు. నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Related posts

మీ పూజ గదిలో అగ్గిపెట్టె ఉంచుతున్నారా. అయితే, ఈ ఒక్క పొరపాటు చాలు.

Xloro News

ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే ఇంత లాభం ఉంటుందా..?

Xloro News

కొండగట్టు ఆంజనేయ స్వామి చరిత్ర గురించి తెలుసా..?

Xloro News

Leave a Comment