BSNL నుంచి అదిరిపోయే ప్లాన్.. బిఎస్ఎన్ఎల్ పాన్-ఇండియా స్థాయిలో వినియోగదారుల కోసం రూ. 1499 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఇది రోజుకు 100 SMSలు, అపరిమిత కాల్స్, 24GB డేటాను అందిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నందున, ఏ రాష్ట్రంలోనైనా వినియోగదారులు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఇతర ప్రైవేట్ ఆపరేటర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. తమ సిమ్‌ను ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. అయితే, ఈ ఆఫర్ మరో 10 రోజులు మాత్రమే ఉంటుంది.
