LG QNED Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా EPL సేల్ నుంచి డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ ఈరోజు అర్ధరాత్రి తో ముగిస్తుండగా, ఈరోజు ఈ బిగ్ డీల్ ను అందించింది. అమెజాన్ సేల్ నుంచి ఈ LG లేటెస్ట్ స్మార్ట్ టీవీని మంచి ఆఫర్ ధరకు అందుకునే అవకాశం వుంది. అందుకే, అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ పవర్ ఫుల్ డీల్ ను అందిస్తున్నాను.
LG QNED Smart Tv : ఆఫర్
ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ ఇండియా మార్కెట్ లో రూ. 69,990 రూపాయల ధరతో వచ్చింది మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి కూడా ఇదే ధరకు సేల్ అవుతోంది. అయితే, ఈ స్మార్ట్ టీవీ పై కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్స్ తో ను అమెజాన్ జత చేసింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఆఫర్ ధరకు లభిస్తుంది.
ఇరాక్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 6000 భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ అందించింది. ఇది కాకుండా DBS, Federal, మరియు HSBC క్రెడిట్ కార్డ్స్ పై రూ. 1, 500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని రూ. 62,490 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్స్ పై రూ. 5,706 సేవింగ్ చేసే No Cost EMI ఆఫర్ ను కూడా అమెజాన్ ఆఫర్ చేస్తోంది.
LG (55) QNED Smart Tv :
ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 4K UHD (3840×2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన QNED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, AI బ్రైట్నెస్, 4K అప్ స్కేలింగ్, డైనమిక్ టోన్ మ్యాపింగ్,లోకల్ డిమ్మింగ్ మరియు QNED కలర్ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ α5 AI Processor 4K Gen6 ప్రోసెసర్, 1.5 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ WebOS పై పని చేస్తుంది మరియు మ్యాజిక్ రిమోట్ తో వస్తుంది. ఇందులో 4 HDMI, 2 USB, ఆప్టికల్, ఈథర్నెట్, ఇన్ బిల్ట్ Wi-Fi మరియు బ్లూటూత్ తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. HGIG మోడ్, గేమ్ ఆప్టిమైజర్, ALLM మరియు Filmmaker మోడ్ లను కలిగి ఉంటుంది.
సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీ Dolby Digital మరియు AI Sound Pro సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ 20W సౌండ్ అవుట్ అందిస్తుంది.