HealthSpecial Articles

Horse Gram | ఉలవలను తింటే ఇన్ని లాభాలు కలుగుతాయా..

 ప్రాచీన కాలం నుంచి ఉలవలను మనం ఆహారంగా ఉపయోగిస్తున్నాం. ఉత్తర భారత దేశంలోనూ చాలా మంది ఉలవలను తింటుంటారు. దీంతో పలు రకాల వంటకాలను చేయవచ్చు.

ఉలవలతో చేసే చారు ఎంతో రుచిగా ఉంటుంది. ఉలవల్లో ప్రోటీన్లు, ఐరన్‌, కార్బొహైడ్రేట్లు, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఉలవలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శరీరంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉలవలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయి. షుగర్ ఉన్నవారికి ఉలవలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉలవలను తింటుంటే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడి బీపీ కూడా తగ్గుతుంది.

మూత్రాశయ సమస్యలకు..

ఉలవలు మనకు పలు రకాల రంగుల్లో లభిస్తాయి. అయితే ఎరుపు రంగులో ఉండే ఉలవలను చాలా మంది వాడుతుంటారు. నవ ధాన్యాల్లో ఉలవలు కూడా ఒకటిగా పేరుగాంచాయి. ఉలవలతో కషాయం లేదా చారు చేసి తాగుతుంటే మూల వ్యాధి తగ్గుతుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది. శరీరంలో ఉన్న కఫం అంతా కరిగిపోతుంది. దీంతో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి హితకరంగా ఉంటుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. స్త్రీలకు నెలసరి సక్రమంగా వస్తుంది. ఆ సమయంలో వచ్చే నొప్పుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ఉలవలతో నీళ్లను లేదా చారును తయారు చేసి తింటుంటే గాల్ స్టోన్స్‌, కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. ఇవి ఆకలిని పుట్టిస్తాయి. అజీర్తి సమస్యను తగ్గిస్తాయి.

కంటి చూపు పెరుగుతుంది..

ఉలవలను తింటుంటే వెక్కిళ్లు తగ్గిపోతాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్ల సమస్యలు ఉండవు. వయస్సు మీద పడడం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. ఉలవల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక ఎదిగే పిల్లలకు ఇవి చక్కని ఆహారంగా పనిచేస్తాయి. ఉలవల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తం తయారయ్యేలా చేస్తుంది. ఉలవల్లో మాలిబ్డినం అనే ఖనిజం కూడా సమృద్ధిగానే ఉంటుంది. ఇది రోగాల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఉలవలను ఉడకబెట్టి లేదా మరిగించి నీళ్లను లేదా కషాయం వంటివి చేసుకుని తాగాల్సి ఉంటుంది. ఉలవలను పొట్టు తీయకూడదు, వేయించకూడదు. అలా చేస్తే వాటిల్లో ఉండే పోషక విలువలు నశిస్తాయి.

జీర్ణ సమస్యలకు..

ఉలవలను మొలకెత్తించి తింటే వాటిల్లో ఉండే పోషకాలు గణనీయంగా పెరుగుతాయి. ఉలవలను తింటే ఆకలి పెరుగుతుంది. ఏ ఆహారం కూడా తినాలనిపించని వారు ఉలవలను తింటుంటే నాలుకకు రుచి తెలుస్తుంది. వీటిని తింటే కఫం పలుచగా మారి బయటకు వస్తుంది. దీంతో దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తులు, గొంతులో ఉండే కఫం పోతుంది. కళ్లు నీరు కారడం తగ్గుతుంది. కళ్లలో వచ్చే పుసులు తగ్గుతాయి. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కూడా ఉలవలు బయటకు పంపిస్తాయి. తరచూ వెక్కిళ్లు వస్తుంటే ఉలవలను తింటే తగ్గిపోతాయి. ఉలవలను తింటే మల విసర్జన సాఫీగా జరుగుతుంది. ఉలవలు సహజంగానే శరీరంలో వేడిని పుట్టిస్తాయి. కనుక వేడి శరీరం ఉన్నవారు వేసవిలో వీటిని తింటే వీటికి తోడుగా మజ్జిగను కూడా తీసుకోవాలి. దీంతో శరీరం అతి వేడి చేయకుండా ఉంటుంది.

Related posts

ప్రతి రోజూ బొప్పాయి తింటున్నారా..? దీనిని ఎవరు తినకూడదో తెలుసా..?

Xloro News

1 స్పూన్ గింజలతో ఇలా చేస్తే మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు చిటికెలో మాయం

Xloro News

TDS Payment: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్

Xloro News

Leave a Comment