BusinessTechnology

1.83 అంగుళాల డిస్ప్లే, 15 రోజుల బ్యాటరీ లైఫ్.. బోట్ స్టోర్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్

ప్రముఖ బ్రాండ్ boAt తన తాజా స్మార్ట్‌వాచ్ బోట్ స్టోర్మ్ ఇన్ఫినిటీను భారత మార్కెట్లో విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లు, ప్రీమియం స్మార్ట్‌వాచ్ అనుభూతిని అందించేలా ఈ వాచ్ ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. ఇక ఈ బోట్ స్టోర్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే..

బోట్ స్టోర్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ లో 1.83 అంగుళాల AMOLED స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. ఇక 60Hz రిఫ్రెష్ రేట్ తో రావడంతో మృదువైన టచ్ అనుభవం అందనుంది. ఇక బ్రైట్‌నెస్ విషయానికి వస్తే ఇందులు 600 నిట్స్ కలిగి ఉండడంవల్ల ఉదయంపూట వెలుతురులోనూ స్పష్టంగా కనపడుతుంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంది. హై-క్వాలిటీ మైక్, స్పీకర్‌తో ఫోన్ కాల్స్‌ను నేరుగా వాచ్ ద్వారా మాట్లాడవచ్చు. ఇందులో హెల్త్ ట్రాకింగ్ కోసం హార్ట్ రేట్, SpO2, స్ట్రెస్ మానిటరింగ్, మెడిటేషన్ మోడ్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇక 15 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందుతుంది. ఇందులో మొత్తంగా 100+ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. అలాగే నేరుగా వాచ్‌లో కొన్ని గేమ్స్ (ఇన్‌బిల్ట్ గేమ్స్) ఆడే సౌలభ్యం కూడా ఉంది. తేమ, చెమట నుంచి రక్షణ అందించే వాటర్ రెసిస్టెంట్ IP67 రేటింగ్ కూడా ఉంది. boAt Storm Infinity స్మార్ట్‌వాచ్‌ను రూ.1299 ధరకు boAt అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఇతర ఆన్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. మొత్తంగా బోట్ స్టోర్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ డిజైన్ పరంగా మాత్రమే కాకుండా.. హెల్త్ ట్రాకింగ్, బ్లూటూత్ కాలింగ్, స్మార్ట్ నోటిఫికేషన్లు వంటి అనేక ఫీచర్లతో టెక్నాలజీ ప్రేమికులను ఆకర్షిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో అధిక ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.

Related posts

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ షురూ.. ధర రూ.79,999 మాత్రమే

Xloro News

Smart TVs: అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీలు

Xloro News

Gold rate today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Xloro News

Leave a Comment