EducationGovt. SchemesTelangana News

మరమ్మతులకు గురవుతున్న బైజూస్‌ ట్యాబ్​లు

 ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించడమే లక్ష్యమని డిజిటల్‌ విద్యా బోధనలకు గత జగన్ సర్కార్ నాంది పలికింది. ఇందులో భాగంగా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు బైజూస్‌ కంటెంట్‌ పేరిట ట్యాబ్​లను పంపిణీ చేసింది. అవి నేడు ఒక్కొక్కటిగా మూలకు చేరుతున్నాయి. చాలా చోట్ల ట్యాబ్​లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. తద్వారా బోధనా సమయాల్లో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఏలూరు జిల్లాలో 2022-2023, 2023-2024 విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మొత్తం 34,995 ట్యాబ్‌లు పంపిణీ చేశారు. అరకొర పాఠ్యాంశాల్ని ఆర్భాటంగా అప్‌లోడ్‌ చేశారు. ప్రస్తుతం వాటిలో దాదాపు 25 శాతం మరమ్మతులకు గురయ్యాయని అధికారులు చెబుతున్నారు. బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నప్పటికీ అన్ని సబ్జెక్టులను ట్యాబ్‌లలో అప్‌లోడ్‌ చేయలేదు.

Byjus Content Tabs Damaged : చేసిన సబ్జెక్టుల్లో కొన్ని పాఠ్యాంశాలు పొందుపరచకపోవడం, నమోదు చేసిన పాఠ్యాంశం పూర్తి స్థాయిలో నిక్షిప్తం చేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర బోధనే సాగిందని చెప్పొచ్చు. దీంతో పాఠ్యాంశాలను విపులంగా వివరించకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరోవైపు లాకింగ్‌ వ్యవస్థలో లోపాల కారణంగా విద్యార్థులు ట్యాబుల్లో వినోదయాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసుకుని చూస్తున్నారు.

 

 

Related posts

గుర‌క స‌మ‌స్య ఉన్న‌వారు పాటించాల్సిన సూచ‌న‌లు

Xloro News

ఈ పండు రోజుకు 2 తినండి లివర్‌ క్లీన్‌ అవుతుంది

Xloro News

తల్లికి వందనంపై స్పష్టత ఇచ్చిన సర్కార్

Xloro News

Leave a Comment