టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్, లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన సినిమా ‘రాబిన్‌హుడ్’. భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ మూవీలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్రలో నటించాడు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ చేరుకున్నాడే వార్నర్.
ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ సినిమా తర్వాత మరోసారి జత కట్టారు నితిన్, శ్రీలీల. వీరిద్దరూ హీరో, హీరోయిన్లు గా నటించిన చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ సినిమాను ‘పుష్ప2’ ఫేమ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, సాంగ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న రాబిన్ హుడ్ సినిమా ఉగాది కానుకగా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. కాగా రాబిన్ హుడ్ సినిమాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే అతని లుక్ కు సంబంధించి రిలీజైన పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం (మార్చి 23) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఇదే ఈవెంట్ లో మూవీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ కోసం డేవిడ్ వార్నర్ హైదరాబాద్ చేరుకున్నాడు.
రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో డేవిడ్ వార్నర్ కు ఘన స్వాగతం లభించింది. అభిమానులతో కలిసి దర్శకుడు వెంకీ కుడుముల వార్నర్ కు గ్రాండ్ వెల్‌కం చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాబిన్ హుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరలవుతున్నాయి.