Health

Chapati: రాత్రిళ్లు చపాతి తింటున్నారా? అయితే ఇది మీకోసమే

బరువు తగ్గాలనుకునే వాళ్లు.. ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్లు తమ డైట్ నుంచి రైస్‌ను తీసేసి చపాతీ తింటూ ఉంటారు. కొంతమంది ప్రతీ రోజూ రాత్రి చపాతీ తింటూ ఉంటారు.

రెండు లేదా మూడు చపాతీలు తిని భోజనాన్ని ముగిస్తుంటారు. ఇలా ప్రతీ రోజూ రాత్రి చపాతీ తినటం ఎంత వరకు మేలు?.. రాత్రి పూట చపాతీ తినటం లాభమా.. నష్టమా.. అంటే కచ్చితంగా లాభమే. నూటికి నూరు శాతం గోధుమలతో చేసిన చపాతీ తినటం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి.

జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది

రాత్రిళ్లు మన జీర్ణ వ్యవస్థ చాలా బలహీనంగా పని చేస్తుంది. అలాంటి టైంలో దాన్ని ఫుల్ చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే మితంగా మన శరీరానికి సరిపోయేంత చపాతీలను తింటే చాలా మేలు జరుగుతుంది. చపాతీలో ఉండే డైటరీ ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రేగుల కదిలికలను కూడా మంచి ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా మల బద్ధకాన్ని తగ్గిస్తుంది. హై ఫైబర్ మన కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉండేలా చేస్తుంది. తద్వారా రాత్రిళ్లు మళ్లీ ఆహారం తినాలనే బాధ తప్పుతుంది. చపాతీలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అరగడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి. మెల్లమెల్లగా శరీరానికి శక్తిని అందజేస్తాయి. రాత్రిళ్లు జీర్ణ వ్యవస్థపై తక్కువ ఒత్తిడి పడటం వల్ల నిద్ర చక్కగా పడుతుంది.

బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది

చపాతిలో.. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అది మన రక్తంలోని చక్కెరల నిల్వలను అదుపులో ఉంచుతుంది. రాత్రిళ్లు రక్తంలో చక్కెర శాతం పెరగకుండా చూసుకుంటుంది. చపాతీ తినటం వల్ల గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది. చపాతీల కారణంగా కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. దాని వల్ల గుండెకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగని ఇష్టం వచ్చినట్లు చపాతీలను తినటం కూడా సరికాదు.. వంద గ్రాముల రైస్‌లో ఉండే దానికంటే చపాతీలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకని తక్కువ మొత్తంలో తీసుకుంటే మంచింది. లేదంటే బరువు పెరిగే అవకాశం ఉంది.

Related posts

కేశసౌందర్యం కోసం ఈ లడ్డు తప్పకుండా తినండి

Xloro News

Heart: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.?

Xloro News

1 స్పూన్ గింజలతో ఇలా చేస్తే మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు చిటికెలో మాయం

Xloro News

Leave a Comment