ప్రస్తుతం వేసవికాలంలో కావడంతో మనకు ఎక్కడ చూసినా కూడా పుచ్చకాయలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది పుచ్చకాయలను కట్ చేసుకుని తింటే మరికొందరు జ్యూస్ రూపంలో చేసుకొని తింటూ ఉంటారు.
పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల డిహైడ్రేషన్ వంటి సమస్యలు రావు. అలాగే మీరు కూడా శరీరానికి కావాల్సినంత అందుతుంది. పుచ్చకాయలను తింటే మన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే చల్లగా కూడా ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు కూడా అందుతాయని చెబుతున్నారు.
పుచ్చకాయలు తినేటప్పుడు చాలామంది వాటి విత్తనాలు అలాగే మింగేస్తే కొందరు మాత్రం ఆ విత్తనాలను బయటకు తీసేసి తింటూ ఉంటారు. పుచ్చకాయ విత్తనాలు తినకూడదని సమస్యలు వస్తాయని అనుకుంటూ ఉంటారు. నిజానికి పుచ్చకాయ విత్తనాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయట. ఈ విత్తనాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయట. జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఈ విత్తనాల్లో మెండుగా ఉంటాయని చెబుతున్నారు. అంతేకాక వీటిలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయట. డయాబెటీస్ పేషెంట్లు కొన్ని పండ్లను తినకూడదట.
ఎందుకంటే కొన్ని పండ్లలో షుగర్ కంటెంట్ ఉంటుందట. అయితే మధుమేహం ఉన్నవారు పుచ్చకాయను తినవచ్చని, పుచ్చకాయ గింజలను కూడా ఇలాంటి భయం లేకుండా తినవచ్చు అని చెబుతున్నారు. పుచ్చకాయ గింజలు డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయట. పుచ్చకాయ గింజలు మధుమేహాన్ని కంట్రోల్ చేస్తాయట. వయసు మీద పడుతున్నా ఈ గింజలను తింటే మీరు యవ్వనంగా కనిపిస్తారట. అవును ఈ గింజలు చర్మాన్ని చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయట. ముడతలను తగ్గిస్తాయట. పుచ్చకాయ విత్తనాల్లో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయట. ఇవి చర్మం యవ్వనంగా కనిపించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే మెమొరీ పవర్ పెంచడానికి పుచ్చకాయ విత్తనాలు బాగా సహాయపడతాయని చెబుతున్నారు. బలహీనమైన జ్ఞాపకశక్తి లేదా మతిమరుపు సమస్యను పరిష్కరించడానికి ఇవి బాగా సహాయపడుతాయట.