రాగిజావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికి తెలిసిందే. ముఖ్యంగా ఇది డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో బాగా పనిచేస్తుంది. రాగి జావను కొంతమంది ఉదయం పూట తీసుకుంటే మరి కొందరు సాయంత్రం తీసుకుంటూ ఉంటారు.
ఈ రాగిలో ఫైబర్, ప్రోటీన్, న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని జావ లాగా మాత్రమే కాదు. పలు రకాలుగా కూడా తీసుకోవచ్చు. రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి సంకటి ఇలా ఏ రూపంలో తీసుకున్నా మన ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.
కాగా రాగులు గ్లూటెన్ ఫ్రీగా ఉంటాయట. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయని ఇవి తినడం వల్ల మన శరీరంలోని కొలిస్ట్రాల్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచుతాయట. అంతేకాకుండా గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయని, మొత్తం ఆరోగ్యం మెరుగుపరచడంలోనూ కీలకంగా పని చేస్తుందని చెబుతున్నారు. చాలామంది ఐరన్ లోపంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటివారు బ్రేక్ఫాస్ట్ సమయంలో రాగిజావ తాగితే లేదంటే రాగి పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలు తింటే ఐరన్ లోకం తగ్గిపోతుందట.
బరువు తగ్గాలి అనుకునేవారు ఈరోజుల్లో ఏవేవో ఫుడ్స్ తింటున్నారు. బ్రేక్ ఫాస్ట్ లో మంచిగా ఒక గ్లాస్ రాగి జావ తాగితే కడుపు నిండిన అనుభూతి కలుగుతుందట. అలాగే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయట. బరువు తగ్గడంలోనూ ఈజీగా సహాయపడుతుందని చెబుతున్నారు. బరువు తగ్గాలి అనుకునేవారు ఈరోజుల్లో ఏవేవో ఫుడ్స్ తింటున్నారు. బ్రేక్ ఫాస్ట్ లో మంచిగా ఒక గ్లాస్ రాగి జావ తాగితే కడుపు నిండిన అనుభూతి కలుగుతుందట. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయట. అలాగే బరువు తగ్గడంలోనూ ఈజీగా సహాయపడుతుందట. ఎముకలు బలంగా మార్చడంలోనూ రాగులు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మహిళలు, పిల్లలు.. రాగిజావను కచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు. .