Andhra pradesh

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మాజీ సీఎం జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాస్త సైలెంట్ అయిన మాజీ సీఎం జగన్ (Former CM Jagan).. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం (coalition government)పై విరుచుకుపడుతున్నారు.

ముఖ్యంగా కూటమిలోకి కీలక నేతలను టార్గెట్ చేసిన జగన్.. అసెంబ్లీ సమావేశాలకు రాకపోయినప్పటికీ మీడియా, సోషల్ మీడియా వేదికగా ప్రజల సమస్యలపై, రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) పై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మంపై పవన్ కు మాట్లాడే అర్హత లేదని ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు. కాశీనాయన క్షేత్రాన్ని (Kasi Nayana Kshetra) అధికారులు కూల్చేస్తుంటే డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా జగన్ తన ట్వీట్‌ (Tweet)లో ఇలా రాసుకొచ్చారు. దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపై, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా అని ప్రశ్నించారు.

కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు 7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆ క్షేత్ర పరిరక్షణకు ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కి ముఖ్యమంత్రి హోదాలో తానే స్వయంగా లేఖ రాసినట్లు తెలిపారు. తన లేఖలో కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్‌ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా.. ఎలాంటి ఆంక్షలను విధించినా పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పామని, మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలిపివేసిందని, మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్య కూడా తీసుకోలేదని, ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అని ఈ సందర్భంగా జగన్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Related posts

ఇంటర్వెల్, లంచ్ మాత్రమే కాదు.. ఏపీ పాఠశాలల్లో మరో బ్రేక్

Xloro News

ఏప్రిల్ 1 నుంచి దివ్యాంగులకు ‘సదరమ్’ స్లాట్లు

Xloro News

Jayamangala చంద్రబాబు కాళ్ల మీద పడ్డ వైపీసీ మాజీ నేత

Xloro News

Leave a Comment