Govt. Schemes

pensioners : పింఛన్‌దారులకు తీపి కబురు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు (pensioners) కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రతినెలా ఒకటో తేదీన ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. సచివాలయ సిబ్బంది చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా లబ్ధిదారుల వేలిముద్రలను స్కాన్ చేసి, సచివాలయ సిబ్బంది వారికి పింఛన్ మొత్తాన్ని అందిస్తారు.
అయితే, వృద్ధాప్యం కారణంగా, కొంతమంది వృద్ధుల వేలిముద్రలు అరిగిపోవడంతో సమస్య ఎదుర్కొంటున్నారు. స్కానర్లపై వారి వేలిముద్రలు పడకపోవడంతో, పింఛన్ల పంపిణీలో సమస్య తలెత్తింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలకు కొత్త ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌లను పంపుతున్నారు. మొత్తం 1,34,450 స్కానర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది. సచివాలయాల వారీగా వీటిని పంపిణీ చేయనున్నారు. ఉదయ్ సాఫ్ట్‌వేర్‌తో నవీకరించబడిన కొత్త పరికరాల సహాయంతో వేలిముద్ర సమస్యకు చెక్ పెట్టవచ్చని అధికారులు మరియు ప్రభుత్వం భావిస్తున్నారు. ఈ కొత్త స్కానర్లు అందుబాటులోకి వస్తే పెద్ద వయసు వారికీ మేలు జరుగనుంది. ఈ నేపథ్యంలో వేలిముద్రల సమస్య ఇప్పుడు పరిష్కారం కానుంది.

Related posts

Investment Scheme For Girls: ఈ స్కీమ్‌లో చేరండి, మీ కుమార్తెకు రూ.70 లక్షలు గిఫ్ట్‌గా ఇవ్వండి!

Xloro News

₹50,000 పెట్టి, నెలకు ₹15,000 ఆదాయం… సూర్య ఉచిత విద్యుత్ పథకం వివరాలు…

Xloro News

మహిళలకు గుడ్‌న్యూస్‌.. వడ్డీ లేకుండా 5 లక్షలు

Xloro News

Leave a Comment