భారతదేశంలోని సబ్-కాంపాక్ట్ సెడాన్ మార్కెట్లో మారుతి సుజుకి డిజైర్, కొత్త తరం హోండా అమేజ్, అప్డేటెడ్ టాటా టిగోర్ ఇటీవలే లాంఛ్ అయ్యాయి. వీటిలో హోండా అమేజ్‌ను డిసెంబర్ 2024లో అప్డేట్ చేశారు. టాటా టిగోర్ జనవరి 2025లో అప్డేట్ అయింది. అయితే హోండా అమేజ్ డిజైన్ ఫీచర్ల పరంగా పూర్తిగా మార్చినప్పటికీ, టాటా టిగోర్‌లో చిన్న డిజైన్ మార్పులు అండ్ ఫీచర్ చేర్పులతో ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ మాత్రమే ఇవ్వడం జరిగింది.
ఫీచర్ అప్‌డేట్‌లతో పాటు టాటా టిగోర్ ఇప్పుడు కొత్త టాప్ ఎండ్ ట్రిమ్- XZ Plus Luxలో కూడా అందుబాటులో ఉంది. ఈ టాటా టిగోర్ XZ Plus Lux వేరియంట్ మార్కెట్లో 2024 హోండా అమేజ్‌లోని టాప్ ట్రిమ్ ZXతో పోటీపడుతుంది. ఈ సందర్భంగా ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఎందులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి? ఏది వాల్యూ ఫర్ మనీ వంటి వివరాలు తెలుసుకునేందుకు వీటి కంపారిజన్ మీకోసం. ఈ కంపారిజన్ బట్టి ఈ రెండింటిలో మీకు ఏది సరైనది అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు.
Honda Amaze ZX (vs) Tata Tigor XZ Plus Lux: ఫీచర్లు
1. Honda Amaze ZX: ఫుల్లీ లోడెడ్ హోండా అమేజ్ ZX.. DRL లతో కూడిన LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, LED టెయిల్‌లైట్లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, బాడీ-కలర్ ORVM లతో పాటు డ్యూయల్-టోన్ 15-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. దీనితో పాటు దీని ఇంటీరియర్స్‌లో వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, రియర్ AC వెంట్స్, రియర్ డీఫాగర్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ వంటి లక్షణాలు CVT వేరియంట్‌లో మాత్రమే లభిస్తాయి.
దీని క్యాబిన్‌లో అందుబాటులో ఉన్న ఇతర ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే.. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6-స్పీకర్ సిస్టమ్, బిల్డ్-ఇన్ అలెక్సా వంటివి ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్లు: భద్రతా ఫీచర్లుగా దీనికి అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్‌వాచ్ కెమెరా, రియర్ డీఫాగర్ అండ్ రియర్‌వ్యూ కెమెరాతో హోండా సెన్సింగ్ లెవల్-2 ADAS సూట్ అందించారు.
2. Tata Tigor XZ Plus Lux: 2025 టాటా టిగోర్ టాప్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే.. దీనికి 15-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. ఇవి పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే దాని CNG వెర్షన్‌లో కంపెనీ 14-అంగుళాల రిమ్‌లను ఉపయోగిస్తుంది. దీనితో పాటు ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటోఫోల్డ్ ORVMలు, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి ఫీచర్లు ఇందులో అందించారు. ఈ కారుకు ప్రీమియం టచ్ ఇచ్చేందుకు క్రోమ్-లైన్డ్ డోర్ హ్యాండిల్స్ ఇన్‌స్టాల్ చేశారు.
దీని ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే.. ఇది హర్మాన్ 10.25-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో వస్తుంది. అలాగే మెరుగైన ఆడియో ఎక్స్పీరియన్స్ కోసం నాలుగు ట్వీటర్‌లను కలిగి ఉంటుంది.
ఇతర ఫీచర్లు: దీని అదనపు ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే.. ఇందులో పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఫుల్లీ డిజిటల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, లెదర్‌తో చుట్టి ఉన్న స్టీరింగ్ వీల్, ఫ్రంట్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్, వానిటీ మిర్రర్ అండ్ మ్యాగజైన్ పాకెట్స్ కూడా ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్లు: కారులో అందుబాటులో ఉన్న భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ వేరియంట్‌లో 360-డిగ్రీల కెమెరా సిస్టమ్ అండ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి. వీటితో పాటు ఇది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) అండ్ హిల్ హోల్డ్ కంట్రోల్ (HHC) వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది.
Honda Amaze ZX vs Tata Tigor XZ Plus Lux: పవర్‌ట్రెయిన్
1. Honda Amaze ZX: హోండా అమేజ్ అన్ని వేరియంట్లు ఒకే ఒక 1.2-లీటర్, 4-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ అండ్ CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ సబ్-కాంపాక్ట్ సెడాన్ XZ ప్లస్ లక్స్ వేరియంట్ పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్‌లలో లభిస్తుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో మాత్రమే అమ్ముడవుతోంది.
2. Tata Tigor XZ Plus Lux: టాటా టిగోర్ గురించి మాట్లాడుకుంటే.. ఇది 1.2-లీటర్, 3-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. పెట్రోల్ వేరియంట్‌లో ఈ ఇంజిన్ 85 bhp పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే Tigor CNG వేరియంట్‌లో అదే ఇంజిన్ 72 bhp పవర్, 95 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Honda Amaze ZX (vs) Tata Tigor XZ Plus Lux: ధర
1. Honda Amaze ZX: కొత్త హోండా అమేజ్ ZX మాన్యువల్ వేరియంట్ ధర రూ. 9.90 లక్షలు (ఎక్స్-షోరూమ్), CVT గేర్‌బాక్స్ వేరియంట్ ధర రూ. 11.20 లక్షలు (ఎక్స్-షోరూమ్).
2. Tata Tigor XZ Plus Lux: టాటా టిగోర్ XZ Plus Lux పెట్రోల్ ఆప్షన్ ధర రూ. 8.50 లక్షలు. దాని CNG వేరియంట్ ధర రూ. 9.50 లక్షలు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.