బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోవడం అనేది ఇంటి పనుల్లో అతి ముఖ్యమైనది. శుభ్రతను పట్టించుకోకపోతే అది ఇంట్లో అనారోగ్యాన్ని తీసుకురావచ్చు. ముఖ్యంగా బాత్రూమ్ శుభ్రంగా లేకపోతే బ్యాక్టీరియా, వాసనలు, అనారోగ్యకర పరిస్థితులు ఏర్పడుతాయి.
అందువల్ల బాత్రూమ్‌ను క్రమంగా శుభ్రం చేయడం వల్ల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. బాత్రూమ్ టైల్స్, నేలలు, మరకలను సులభంగా ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బాత్రూమ్ టైల్స్ శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం. బాత్రూమ్ ఎక్కువగా ఉపయోగించే ప్రదేశం కాబట్టి దాని శుభ్రతను నిర్లక్ష్యం చేయకూడదు. మురికి, మరకలు ఉంటే అవి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అందుకే బాత్రూమ్ టైల్స్ శుభ్రంగా ఉంచడం ఆరోగ్య రక్షణలో కీలకం. రోజూ శుభ్రం చేయడం వలన కీటకాలు, బ్యాక్టీరియా ఉండకుండా కాపాడుకోవచ్చు.
బాత్రూమ్ నేలను మెరిసేలా ఉంచుకోవాలనుకుంటే రాక్ సాల్ట్ చాలా సహాయం చేస్తుంది. ఒక బకెట్ నీటిని తీసుకొని అందులో కొద్దిగా డెట్టాల్ వేసి రాక్ సాల్ట్ కలపండి. ఈ మిశ్రమంతో నేలను శుభ్రం చేస్తే మురికి తొలగిపోయి మీ బాత్రూమ్ మెరిసిపోతుంది. డెట్టాల్ వలన కీటకాలు కూడా చనిపోతాయి. అలాగే మంచి వాసన వస్తుంది. దీని వల్ల మీ బాత్రూమ్ ఎప్పుడూ శుభ్రంగా అనిపిస్తుంది.
బాత్రూమ్ లోని టైల్స్ లేదా వాష్ బేసిన్ మీద ఉన్న మరకలను తొలగించడానికి సరైన చిట్కాలు పాటిస్తే చాలు. ఒక గిన్నెలో లాండ్రీ డిటర్జెంట్ తీసుకొని దానికి కొంచెం హార్పిక్ కలపండి. దీనికి తోడు కొద్దిగా ఉప్పు కూడా జోడించండి. ఈ మిశ్రమాన్ని టైల్స్ లేదా మరకల మీద రాసి కొద్ది సేపు ఉంచండి. తరువాత నీటితో కడగండి. ఈ పద్ధతితో బాత్రూమ్ మరకలు తొలగిపోయి టైల్స్ మెరుస్తాయి.
ఇల్లు, బాత్రూమ్ శుభ్రంగా ఉంటే ఇంట్లో ఉన్నవారికి మంచి ఆరోగ్యం ఉంటుంది. మంచి వాసనతో, శుభ్రతతో ఉన్న బాత్రూమ్ ఎప్పుడూ ఆరోగ్యకరమైన వాతావరణం అందిస్తుంది. మీరు పై చెప్పిన చిట్కాలు పాటిస్తే మీ బాత్రూమ్ ఎప్పుడూ శుభ్రంగా మెరుస్తూ ఉంటుంది.