Andhra pradesh

Jayamangala చంద్రబాబు కాళ్ల మీద పడ్డ వైపీసీ మాజీ నేత

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కాళ్లపై పడ్డారు. ఇవాళ ఆయన పోలవరం ప్రాజెక్టు సందర్శనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు.

అయితే, జయమంగళను చంద్రబాబు ఆప్యాయంగా దగ్గరకి తీసుకున్నారు. జయమంగళ త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇటీవల వైసీపీకి,ఎమ్మెల్సీ పదవికి జయమంగళ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇస్తాననటంతో తెలుగుదేశం వదిలి వైసీపీలోకి వెళ్లారు జయమంగళ వెంకటరమణ. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం పార్టీకి, ఎమ్మెల్సీ పదవి కి రాజీనామా చేశారు. అయితే, మండలి చైర్మన్ దగ్గర ఇంకా అతని రాజీనామా పెండింగ్ లో ఉంది.

ఇలా ఉండగా, జయమంగళ వెంకటరమణ 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలిచారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

2019 నుండి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పని చేస్తూ ఎంఎల్‌సి ఎన్నికల ముందు 2023 ఫిబ్రవరి 17న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మార్చి 2023లో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఎంఎల్‌ఎ కోటా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే, 2024 నవంబర్ 23న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు.

Related posts

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. ఉరుములు, మెరుపులతో వర్షాలు..

Xloro News

రాష్ర ప్రజలకు గుడ్ న్యూస్.. ఇంటి స్థలాలపై కీలక ప్రకటన

Xloro News

గుడ్ న్యూస్.. ఏపీ లో 948 అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

Xloro News

Leave a Comment