Crime News

భర్త సొమ్ములిస్తే.. ప్రియుడితో బెట్టింగ్ ఆడించి: మేరఠ్‌ హత్య కేసులో కీలక విషయాలు

ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడి సాయంతో కట్టుకున్న భార్యే దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసిన ఘటన (Merchant Navy officer Murder) సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మేరఠ్‌లో చోటుచేసుకున్న మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నారు. ఈసందర్భంగా పలు కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితురాలు ముస్కాన్‌ రస్తోగి తన భర్త సంపాదించిన డబ్బులను ప్రియుడు సాహిల్‌ శుక్లాకు ఇచ్చినట్లు తెలిసింది. ఆ సొమ్ముతో బెట్టింగ్‌ ఆడించి వచ్చిన డబ్బుతో వీరిద్దరూ విహారయాత్రలకు వెళ్లినట్లు పోలీసు వర్గాల సమాచారం.

విదేశాలకు వెళ్లిన సౌరభ్‌.. తన భార్య, కుమార్తె అవసరాల కోసం ప్రతినెలా రూ.లక్ష చొప్పున పంపించేవాడని దర్యాప్తులో తేలింది. ఆ డబ్బులు తన అకౌంట్‌లో పడగానే ముస్కాన్‌ ఆ విషయాన్ని ప్రియుడికి చేరవేసేదట. ఆ డబ్బుతో సాహిల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లపై బెట్టింగ్‌ పెట్టేవాడని పోలీసువర్గాలు పేర్కొన్నాయి. అక్కడ వచ్చిన డబ్బుతో వీరిద్దరూ రిషికేశ్‌, దెహ్రాదూన్‌ వంటి ప్రాంతాలకు ట్రిప్‌లకు వెళ్లినట్లు తెలిసింది. సాహిల్‌కు ఎలాంటి ఉద్యోగం లేదని, గ్యాంబ్లింగ్‌లో వచ్చిన డబ్బులతోనే జల్సాలు చేసేవాడని స్థానికులు చెబుతున్నారు.

మందుల చీటీ మార్చి..
కాగా.. సౌరభ్‌ను హత్య చేసేందుకు ముస్కాన్ పక్కాగా ప్లాన్‌ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం మందుల చీటీని ఫోర్జరీ చేసి నిద్రమాత్రలు సంపాదించినట్లు తెలిసింది. ‘‘ఫిబ్రవరి 22న ముస్కాన్‌ స్థానికంగా ఉన్న ఓ వైద్యుడి వద్దకు వెళ్లింది. ఆందోళన సమస్యతో బాధపడుతున్నానని చెప్పి మందులు రాయించుకుంది. ఆ తర్వాత ఓ ఖాళీ ప్రిస్క్రిప్షన్‌ పేపర్‌ను సంపాదించి అందులో ఆ మందులు రాసింది. వాటితో పాటు నిద్ర మాత్రల గురించి ఆన్‌లైన్‌లో తెలుసుకొని ఆ పేర్లను చేర్చింది. తొలుత ఫిబ్రవరి 25నే అతడిని హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఆ రోజున సౌరభ్‌ మద్యం తాగకపోవడంతో ఆమె ప్లాన్‌ ఫెయిల్‌ అయ్యింది. ఆ తర్వాత మార్చి 4న అతడికి నిద్ర మాత్రలు ఇచ్చి ప్రియుడితో కలిసి అతి దారుణంగా హత్య చేసింది’’ అని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

సౌరభ్‌ రాజ్‌పుత్‌(29), ముస్కాన్‌(27) 2016లో ప్రేమవివాహం చేసుకున్నారు. సౌరభ్‌ మర్చంట్‌ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ముస్కాన్‌కు సాహిల్‌(25)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. సౌరభ్‌ ఉద్యోగం మానేసి లండన్‌కు వెళ్లి ఓ బేకరీలో పనిచేసేవాడు. గత నెల కుమార్తె పుట్టినరోజు కోసం అతడు ఇండియాకు వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్‌.. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. అనంతరం వీరు మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికారు. శరీర భాగాలను ఓ ప్లాస్టిక్‌ డ్రమ్ములో దాచిపెట్టి పైన సిమెంటుతో కప్పిపెట్టారు.

Related posts

వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Xloro News

హైదరాబాద్‌లో దారుణం.. కత్తులు, గొడ్డళ్లతో వెంటాడి

Xloro News

మాధవి మర్డర్ కేసులో బిగ్ అప్డేట్.. బట్టలు తీసి బాత్రూంలోకి లాక్కెళ్లి!

Xloro News

Leave a Comment