Andhra pradesh

ఆ ప్రాంతంలో భూముల ధరకు రెక్కలు..ఏపీలో కొత్త ఔటర్ రింగ్ రోడ్డు

విజయవాడ శివారు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్ట్ కారణంగా విజయవాడకు 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న శివారు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ బూమ్‌ వచ్చింది.

భూముల ధరలు పెరగడంతో, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని ఓఆర్ఆర్ కారిడార్ వెంట ఉన్న గ్రామాలలో పెట్టుబడి కార్యకలాపాలు పెరిగాయి. భూ యజమానులు, రియల్టర్లు మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఆశిస్తున్నారు. మరోవైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం.. అందులో భాగంగానే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును చేపట్టింది.

దాదాపు 190 కిలోమీటర్ల పొడవుతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు చేపడుతున్నారు. ఐదు జిల్లాలలోని 121 గ్రామాల గుండా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుంది. ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించి, రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అలైన్‌మెంట్‌లో మార్పులను ఖరారు చేయడానికి కసరత్తు చేస్తోంది. మరోవైపు భూసేకరణ కోసం అధికారులను ఇప్పటికే నియమించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ద్వారా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

మరోవైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ప్రతిపాదిత మార్గం వెంట భూముల విలువలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రతిపాదనతో శివారు ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని ఓఆర్ఆర్ కారిడార్ పరిధిలోని గ్రామాలకు పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా భూముల ధరలు మరింత పెరుగుతాయని రియల్టర్లు అంచనా వేస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత ఊపందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పొన్నవరం, తిమ్మాపురం, గన్నవరం, కంచికచర్ల, మైలవరం, అగిరిపల్లి, ఆత్కూరు వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఊపందుకున్నాయని.. పెట్టుబడిదారులు, రియల్టర్లు చెప్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందిందని.. అదే తరహా అభివృద్ధిని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ చూడవచ్చని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పూర్తయితే విజయవాడ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొంటున్నారు.

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా, పారిశ్రామికంగానూ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. దీని వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడించనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను కూడా ప్రభుత్వం త్వరలోనే ఆహ్వానించనుంది. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

Related posts

ఏపీలో విద్యార్ధులకు నారా లోకేష్ అదిరిపోయే న్యూస్.

Xloro News

బాబుకు ఉద్యోగి లేఖ!.. ఇంత చేస్తూ ప్రచారం చేసుకోరా?

Xloro News

Sachivalayam Employees: సచివాలయ ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.. ఇక వారి దశ తిరిగినట్లే?

Xloro News

Leave a Comment