News

మార్చి 29 ఆకాశంలో అద్భుతం.. సూర్య గ్రహణం ఎప్పుడు?

పాల్గుణ మాసం అమావాస్య రోజున అంటే ఈ నెల 29 న ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత కొన్నిరోజులకే ఆకాశంలో అద్భుతం అలంకరించనుండడంతో ఖగోళ శాస్త్ర ప్రియులు దీని కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సూర్య గ్రహణం ఎప్పుడు, ఎక్కడ చూడాలి? USలో గ్రహణం కనిపించే సమయం,ప్లేసెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

తెలుగు నెలలో చివరి రోజు పాల్గుణ మాసం అమావాస్య మార్చి 29, 2025న ఆకాశంలో అద్భుతం ఏర్పడనుంది. ఈ రోజు పాక్షిక సూర్యగ్రహణం ఆకాశాన్ని అలంకరించనుండడంతో ఖగోళ శాస్త్ర ప్రియులు ఈ గ్రహణాన్ని మంత్రముగ్ధులను చేసే సంఘటనగా ఉంటుందని భావిస్తున్నారు. ఖగోళ శాస్త్రవేత్తలు నుంచి సాధారణ స్కైవాచర్ల వరకూ సూర్య గ్రహణం ఏర్పడే సముయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే నెలలో సంపూరణ చంద్ర గ్రహణం ఏర్పడింది. 15 రోజుల తేడాలో మళ్ళీ సూర్య గ్రహణం ఏర్పడి ఆకాశంలో అద్భుతమైన దృశ్య అనుభవాన్ని అందించనుంది. ముఖ్యంగా ఈశాన్య యునైటెడ్ స్టేట్స్ , కెనడాలోని కొన్ని ప్రాంతాలలో ఉన్నవారికి ఈ దృగ్విషయంఅద్భుతమైన అనుభవాన్ని ఇస్తుందని తెలుస్తోంది. చంద్రుడు సూర్యుని కాటు వేస్తున్నట్లుగా భ్రమను సృష్టించనుంది. సూర్యోదయం సమయంలో అద్భుతమైన చంద్రవంక ఇలాంటి భ్రమని వీక్షకులకు కల్పించనుంది.

సూర్య గ్రహణం అంటే.. సూర్యుడు ఆకాశంలో సగం లేదా పూర్తిగా కనుమరుగవుతాడు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంఘటన ఇప్పటికీ ఒక అద్భుతమైన ఖగోళ సంఘటనగా అభివర్ణిస్తారు.

సూర్య గ్రహణ సమయం ప్రత్యక్ష ప్రసార ఈవెంట్‌లు
Space.com ప్రకారం 2025 ఏర్పడే సూర్యగ్రహణాన్ని చూడలనుకునేవారి కోసం… ఈ గ్రహణం భారత దేశ కాలమాన ప్రకారం తెల్లవారు జామున 4:50 నుంచి ఉదయం 8:43 ET మధ్య జరుగుతుంది. 800 మిలియన్లకు పైగా ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు, USలోని ఈశాన్య రాష్ట్రాలలో ఉత్తమ వీక్షణ ఉంటుంది.
USA Today నివేదికలో పేర్కొన్నట్లుగా.. కింది ప్రాంతాలు అత్యంత అద్భుతమైన దృక్కోణాలు కలిగి ఉంటాయి:
న్యూయార్క్ – ఉదయం 6:35 నుంచి 7:12 వరకు
మసాచుసెట్స్ – ఉదయం 6:27 నుంచి 7:08 వరకు
మైనే – ఉదయం 6:13 నుంచి 7:17 వరకు
పెన్సిల్వేనియా – ఉదయం 6:46 నుంచి 7:08 వరకు
న్యూజెర్సీ – ఉదయం 6:43 నుంచి 7:06 వరకు
వర్జీనియా – ఉదయం 6:50 నుంచి 7:03 వరకు
2025 సూర్యగ్రహణం కనెక్టికట్, డెలావేర్, మేరీల్యాండ్, రోడ్ ఐలాండ్, న్యూ హాంప్‌షైర్, వెర్మోంట్, వెస్ట్ వర్జీనియా, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అంతటా కూడా కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణం కనిపించాలంటే వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఉంటుంది.
సూర్యుడు ఉదయించేటప్పుడు గ్రహణం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. క్రమంగా దీని పూర్తి ప్రకాశానికి తిరిగి వచ్చే సమయంలో చంద్రవంక ఆకారంలో ఉన్న సూర్యుడి కనిపిస్తాడు.
భద్రతా జాగ్రత్తలు: సూర్య గ్రహణం వీక్షించాలంటే కళ్ళను రక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. నేరుగా సూర్య గ్రహణాన్ని చూడవద్దు. సూర్యగ్రహణం చూసేందుకు ప్రత్యేక రక్షణ చర్యలు అవసరం.
సరైన కంటి రక్షణ లేకుండా సూర్యుడిని నేరుగా చూడటం వల్ల రెటీనా తీవ్రంగా దెబ్బతింటుంది. దీనిని “గ్రహణ అంధత్వం” అని పిలుస్తారు.
పాక్షిక సూర్యగ్రహణాన్ని సురక్షితంగా వీక్షించడానికి, నిపుణులు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO) ప్రమాణం 12312-2కి అనుగుణంగా ఉండే గ్రహణ అద్దాలను ఉపయోగించమని సిఫార్సు చేస్తున్నారు.
ఈ అద్దాలు తగిన రక్షణను అందిస్తాయని నిర్ధారిస్తూ అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ, నాసా నిర్దిష్ట తయారీదారులను ధృవీకరించాయి. హానికరమైన అతినీలలోహిత (UV) కిరణాల నుంచి కళ్ళను రక్షించడానికి ప్రామాణిక సన్ గ్లాసెస్ సరిపోవు.
మార్చి 29, 2025 శనివారం ఉత్తర అర్ధగోళంలో ఏర్పడనున్న పాక్షిక సూర్యగ్రహణం యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో లక్షలాది మందికి కనిపించే అద్భుతమైన ఖగోళ దృగ్విషయం.

Related posts

వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్‌ పెళ్లి.. ఏర్పాట్లలో శ్యామలా దేవి

Xloro News

కశ్మీర్‌ లోయలో వందేభారత్‌ పరుగులు.. వచ్చే నెలలో ప్రారంభించనున్న మోదీ

Xloro News

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు.. కిలో రూ.3 లక్షలు

Xloro News

Leave a Comment