News

వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్‌ పెళ్లి.. ఏర్పాట్లలో శ్యామలా దేవి

హీరో ప్రభాస్‌ (Prabhas) వివాహం కోసం ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్‌ హీరోల్లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా ప్రభాస్‌ ఉండటంతో ఆయన పెళ్లి గురించి ఎక్కువగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫలానా అమ్మాయిని ప్రభాస్‌ చేసుకోబోతున్నారంటూ.. ఇప్పటికే డార్లింగ్‌ వివాహంపై ఎన్నో రూమర్స్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు వచ్చిన పలు సందర్భాల్లో ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలా దేవి వివరణ ఇస్తూనే ఉన్నారు.

రెబల్‌స్టార్‌ కృష్ణం రాజుకు నట వారసుడిగా పాన్‌ ఇండియా రేంజ్‌లో అభిమానులను సొంతం చేసుకున్నారు ప్రభాస్‌. ఆయన పెళ్లి ఏర్పాట్ల పనుల్లో పెద్దమ్మ శ్యామలా దేవి ఉన్నారని పలు ఇంగ్లీష్‌ వెబ్‌సైట్స్‌ ప్రచురించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్‌ పెళ్లి ఫిక్స్‌ చేసినట్లు న్యూస్‌ 18, హిందూస్థాన్‌ టైమ్స్‌లో కథనాలు వచ్చాయి. అమ్మాయి కుటుంబం ఏపీకి చెందినప్పటికీ వారు హైదరాబాద్‌లో స్థిరపడ్డారని అందులో పేర్కొన్నారు. పెళ్లి ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభాస్‌ పెద్దమ్మ రహస్యంగా చూసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రభాస్‌ పెళ్లి గురించి రీసెంట్‌గా జరిగిన అన్‌స్టాపబుల్‌ షోలో బాలకృష్ణ ప్రశ్నించగా రామ్‌చరణ్‌ కాస్త క్లూ ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్‌లోని గణపవరానికి చెందిన అమ్మాయిని అతడు (ప్రభాస్‌) పెళ్లి చేసుకోనున్నారని చరణ్‌ చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

రీసెంట్‌గా ప్రభాస్ బంధువుల పెళ్లిలో ఆయన ముగ్గురు చెల్లెల్లు (ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి)తో పాటు కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి సందడిగా కనిపించారు. పెళ్లిలో వారంతా కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే.. ఆ వేడుకలోనే ప్రభాస్‌ వివాహం గురించి వార్తలు బయటకు వచ్చాయట. డార్లింగ్‌ పెళ్లి గురించి పలువురి బంధువులతో కొన్ని విషయాలను కూడా శ్యామల దేవి పంచుకున్నారని సమాచారం. అందుకే ఇప్పుడు ప్రభాస్‌ పెళ్లి వార్తలు మరోసారి ట్రెండ్‌ అవుతున్నాయిని కొందరు అంటున్నారు. ఈ అంశం గురించి శ్యామల దేవి వివరణ ఇస్తే కానీ ఫుల్‌స్టాప్‌ పడకపోవచ్చు.

Related posts

Top 3 OTT Films: ఓటీటీలో దుమ్ము రేపుతున్న 3 సినిమాలు.. ఈ వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే

Xloro News

మెదడులో చిప్.. వికలాంగుడు లేచి నడిచిన అద్భుతం.. ఎలోన్ మస్క్ ఘనత

Xloro News

AP High Court: బోరుగడ్డ అనిల్‌పై హైకోర్టు ఆగ్రహం

Xloro News

Leave a Comment