దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ప్రస్తుతం SSMB 29 అనే చిత్రం స్లో అండ్ స్టడీగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఒడిశాలో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుండగా, అక్కడ షూట్ ప్రారంభించిన మొదటి రోజే ఓ వీడియో లీక్ అయింది. జక్కన్న తీసిన సీన్స్ అన్ని లీక్ కావడంతో ఆయన షూటింగ్‌లో ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇందులో ప్రియాంక చోప్రా ముఖ్య పాత్ర పోషిస్తుండగా, ఆమెని నెగెటివ్‌గా జక్కన్న చూపించబోతున్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా అధికారిక ప్రకటన రాని నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. రాజమౌళి సినిమా అంటే ట్విస్ట్‌లు మాములుగా ఉండవు. ఏది చేసిన కూడా అది సంచలనమే అవుతుంది. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వార్తలలో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక రాజమౌళి తన సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కేవలం నటన, టెక్నికల్ అంశాల్లోనే కాకుండా సెట్ లో క్రమశిక్షణ మరియు పర్యావరణంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారనే విషయం మనకు తెలిసిందే. ఇది మరో సారి వెల్లడైంది.
మహేష్ తో షూటింగ్ చేస్తున్న ఆ లోకేషన్ లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదించారు. కఠిన నిబంధనలతో షూటింగ్ ఈ మూవీ సెట్ లో రాజమౌళి అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. హీరో మహేష్ బాబుకు ఇద్దరూ ప్రియాంక చోప్రా కు ఇద్దరు అసిస్టెంట్లకు మాత్రమే లొకేషన్లో పర్మిషన్ ఇవ్వగ మిగతా ఆర్టిస్టులకు ఒక్కొక్కరికి ఒక అసిస్టెంట్ మాత్రమే అనుమతిచ్చారట జక్కన్న. నిజానికి ప్రియాంక చోప్రా కు మేకప్ మరియు వ్యక్తిగత సహాయకులగా దాదాపు 13 మంది ఉంటారు కానీ ఈ సెట్లో కేవలం ఇద్దరికీ మాత్రమే అనుమతి ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఒడిశా లోని కోరాపూట్ జిల్లాలో జరుగుతుంది.