Business

బ్యాంకు అకౌంట్లపై రూల్స్.. అంత డబ్బు డిపాజిట్ చేయొద్దు

మీ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. సామాన్యులకు ఈ సేవింగ్స్ అకౌంట్ రూల్స్ గురించి పెద్దగా అవగాహన ఉండదు.

ఈ ఐటీ రూల్స్ ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లలో ఎంత డబ్బు డిపాజిట్ చేయవచ్చో తెలుసా?

మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా? ఆదాయపన్ను చట్టం ప్రకారం.. దీనికి ఒక నిబంధన ఉందని గమనించాలి. ఐటీ శాఖ నిర్దేశించిన పరిమితి కన్నా ఎక్కువ మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసినట్టుయితే ఆయా అకౌంటుదారుడికి ఐటీ శాఖ నుంచి నోటీసులు రావచ్చు.

సాధారణంగా ఒక సేవింగ్స్ అకౌంట్‌లో డిపాజిట్ లిమిట్ రూ. 10 లక్షల వరకు ఉంటుంది. అదే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య సేవింగ్స్ అకౌంట్లలో రూ. 10 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్లు ఉంటే.. మీరు తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సి రావచ్చు.

రూ. 10 లక్షలపైనా డిపాజిట్ చేసిన అకౌంట్ల గురించి పూర్తి సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయడం తప్పనిసరి. ఈ పరిమితి ఒక సేవింగ్స్ అకౌంట్‌కు మాత్రమే కాదు.. మీ అన్ని సేవింగ్స్ అకౌంట్లకు వర్తిస్తుంది. బ్యాంకులు తమ స్థాయిలో ఇలాంటి లావాదేవీల వివరాలను ఐటీ శాఖకు వెల్లడిస్తాయి.

రూ. 10 లక్షలకు పైగా డిపాజిట్లపై పాన్ కార్డు మస్ట్ :
రూ. 10 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్లను హై వాల్యూ ట్రాన్సాక్షన్లుగా పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితిలో బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఇలాంటి డిపాజిట్ల గురించి పన్ను చట్టం ప్రకారం.. ఆదాయపు పన్ను శాఖకు సమాచారాన్ని అందిస్తాయి. ఒక రోజులో రూ. 50వేల డిపాజిట్లపై పాన్ అందించడం కూడా తప్పనిసరి. ఎవరికైనా పాన్ లేకపోతే.. వారు ఫారం 60/61ని సమర్పించాలి.

డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్ను :
ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు డిపాజిట్లపై రూ. 10వేల కన్నా ఎక్కువ వడ్డీని సంపాదిస్తే.. స్టేబుల్ స్లాబ్ ఆధారంగా దానిపై పన్ను విధిస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ రూ. 10వేల కన్నా తక్కువగా ఉంటే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.

సీనియర్ సిటిజన్లు సెక్షన్ 80TTB కింద రూ. 50వేల వరకు వడ్డీపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పరిమితిని లెక్కించేందుకు మీ అన్ని బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్లపై పొందిన వడ్డీని కలపాల్సి ఉంటుంది.

మీకు ఐటీ నోటీసులు వస్తే ఏమి చేయాలి? :
మీ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లలో పరిమితికి మించి డబ్బులను డిపాజిట్ చేస్తే.. మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎప్పుడైనా నోటీసులు రావొచ్చు. ముందుగా మీరు మీరు డిపాజిట్ చేసిన నగదుకు సంబంధించి తగిన ఆధారాలను అందించాలి.

బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, పెట్టుబడి రికార్డులు, వారసత్వ పత్రాలు అవసరం కావచ్చు. మీరు సర్టిఫైడ్ టాక్స్ అడ్వైజర్‌ను సంప్రదించడం మంచిది. నగదు లావాదేవీల విషయానికొస్తే.. సెక్షన్ 269ST కింద ఏ వ్యక్తి కూడా ఒక రోజులో ఎవరితోనూ రూ. 2 లక్షలకు మించి లావాదేవీలు చేయకూడదు.

Related posts

Investment Scheme For Girls: ఈ స్కీమ్‌లో చేరండి, మీ కుమార్తెకు రూ.70 లక్షలు గిఫ్ట్‌గా ఇవ్వండి!

Xloro News

తక్కువ జీతంతో ₹2 లక్షల అత్యవసర నిధిని నిర్మించాలనుకుంటున్నారా? ఈ 5 దశలు మీ భవిష్యత్తును సురక్షితం చేస్తాయి.

Xloro News

లోన్‌కి ష్యూరిటీ ఇచ్చి ఇబ్బంది పడుతున్నారా? బయటపడటానికి ఇదిగో మార్గం

Xloro News

Leave a Comment