Telangana News

షాకింగ్ న్యూస్.. రూ.2లక్షల పై ఉన్న రైతులకు ‘నో రుణమాఫీ’

రైతులకు రుణమాఫీ చేస్తామని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో మొత్తం రుణం మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట రూ.లక్ష లోపు ఉన్న వారికి ఆ తర్వాత రూ.2 లక్షలు రుణమాఫీని అమలు చేశారు. అయితే రూ.2లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వారి పై మొత్తాన్ని బ్యాంకుల్లో చెల్లిస్తే రూ.2లక్షల రుణం మాఫీ చేస్తామని మొన్నటి వరకు చెబుతూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకు గట్టి షాక్ ఇచ్చింది.

తాజాగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రైతులకు షాక్ ఇచ్చే విషయం చెప్పారు. రూ.2 లక్షల కంటే పైన ఉన్న వారికి రుణమాఫీ చేయమని.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం అంటూ అసెంబ్లీ సాక్షిగా సంచలన ప్రకటన చేశారు. అయితే రెండు లక్షలపై ఉన్న వారు ఆ మొత్తాన్ని బ్యాంకులకు కడితే రూ.2లక్షలు మాఫీ చేస్తామని ప్రకటించి.. ఇప్పుడు మాట మార్చి రైతులను మోసం చేశారంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మంత్రి తుమ్మల ప్రకటనను నిరసిస్తూ వారు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

Related posts

Diabetes Tablets: మధుమేహ పేషెంట్లకు శుభవార్త

Xloro News

గుండెల్లో మంటకు అద్భుతమైన ఇంటి నివారణలు

Xloro News

ఇంటర్‌ విద్యార్ధులకు బిగ్‌ అప్‌డేట్‌.. ఫలితాల విడుదల ఎప్పుడంటే

Xloro News

Leave a Comment