Jobs / Career

NABARD: నాబార్డ్ లో స్పెషలిస్ట్‌ ఉద్యోగాలు.. ఏడాదికి రూ. 70 లక్షల జీతం

లైఫ్ సెట్ అయ్యే జాబ్ కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) కాంట్రాక్ట్ స్పెషలిస్ట్‌ల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 5 పోస్టులను భర్తీచేయనున్నారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ (CISO) 01, వాతావరణ మార్పు నిపుణుడు – ఉపశమనం 01, వాతావరణ మార్పు నిపుణుడు – అనుసరణ 01, కంటెంట్ రైటర్ 01, గ్రాఫిక్ డిజైనర్ 01 భర్తీకానున్నాయి.

అభ్యర్థులు పోస్టులను అనుసరించి డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హతలను కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 21 నుంచి 55 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి అభ్యర్థులను వారి అర్హతలు, అనుభవం ఆధారంగా 1:3 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు నియామకానికి ముందు వైద్య పరీక్ష చేయించుకోవాలి. బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ద్వారా వైద్యపరంగా ఫిట్‌ సాధించాలి. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను బ్యాంక్ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

ఎంపికైన వారికి వార్షిక కన్సాలిడేటెడ్ వేతనం CISO రూ. 50-70 లక్షలు, వాతావరణ మార్పు నిపుణుడు రూ. 25-30 లక్షలు, వాతావరణ మార్పు నిపుణుడు – అనుసరణ రూ. 25-30 లక్షలు, కంటెంట్ రైటర్ రూ. 12 లక్షలు గ్రాఫిక్ డిజైనర్ రూ. 12 లక్షలుగా ఉంటుంది. కాంట్రాక్ట్ వ్యవధి 2 సంవత్సరాలు, 5 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 6 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Related posts

నిరుద్యోగులకు SBI గోల్డెన్ ఛాన్స్.. ప్రతినెల 16 వేలు.. జస్ట్ డిగ్రీ ఉంటే చాలు..

Xloro News

గుడ్ న్యూస్.. ఏపీ లో 948 అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

Xloro News

Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త, 61,579 పోస్టుల భర్తీ

Xloro News

Leave a Comment