Education

School Exams: ఏప్రిల్‌ 9 నుంచి బడి పిల్లలకు సమ్మెటివ్‌-2 పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 15 నుంచి అన్ని పాఠశాలల్లో ఒండి పూట బడులు ప్రారంభమైనాయి.

ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బడులు పనిచేస్తున్నాయి. అంటే మధ్యాహ్నం విద్యార్ధులకు భోజనం అందించి ఇళ్లకు పంపించేస్తారన్నమాట. అయితే విద్యార్ధులకు వేసవి సెలవులకు ముందే వార్షిక పరీక్షలు నిర్వహించవల్సి ఉంది. ఇందుకోసం ఒకటి నుంచి తొమ్మిది తరగతి విద్యార్థులకు సమ్మెటివ్‌ 2 (ఎస్‌ఏ-2) పరీక్షలు ఏప్రిల్‌ 9 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు.

పరీక్షల అనంతరం జవాబుపత్రాలను కూడా వెంటనే మూల్యాంకనం చేసి, మార్చి 23న ఫలితాలు వెల్లడించనున్నారు. అనంతరం తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి, ప్రోగ్రెస్‌ కార్డులు అందించాలని విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మార్చి 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఇస్తారు. తిరిగి జూన్‌ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి.

ఇక ఐటీఐల్లో యువతకు ఉపాధి కల్పించే కోర్సులు.. తెలంగాణ కార్మికశాఖ

తెలంగాణ రాష్ట్రంలోని పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, యువతకు ఉపాధి కల్పించే కొత్తకోర్సులను పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో ప్రవేశపెట్టనున్నట్లు కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త నైపుణ్య కోర్సులతో ఐటీఐలను బలోపేతం చేయాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించించిందని, ఈ మేరకు ప్రైవేటు సంస్థల్ని భాగస్వామ్యం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మార్చి 16న హైదరాబాద్‌లో ఉపాధి కల్పనశాఖ, సెంటర్‌ఫర్‌ గుడ్‌గవర్నెన్సు (సీజీజీ) సంయుక్త ఆధ్వర్యంలో లైఫ్‌సైన్సెస్‌ రంగంలో ‘మెరుగైన భవిష్యత్తుకు నైపుణ్య తెలంగాణ’ అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లైఫ్‌సైన్సెస్‌ ఆధారిత రంగాల్లో యువత నైపుణ్యాలు, భవిష్యత్తు అవసరాలు, సామాజిక, ఆర్థిక అంశాలు, సవాళ్లు, తీసుకోవాల్సిన చర్యలు వంటి తదితర అంశాలపై చర్చించారు.

Related posts

నవోదయ 6వ, 9వ తరగతుల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

Xloro News

Exam Paper Leaked: నల్లగొండ జిల్లాలో టెన్త్ తెలుగు పరీక్ష పేపర్ లీక్‌

Xloro News

మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. మరో 10 రోజుల్లోనే నోటిఫికేషన్‌

Xloro News

Leave a Comment