Business

మార్చి 25, మంగళవారం భారీగా తగ్గిన బంగారం ధర…తులం పసిడి ఏకంగా రూ. 3 వేలు తగ్గింది.

మార్చి 25వ తేదీ మంగళవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు తగ్గింది. ఈరోజు ధరలు ఇలా ఉన్నాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.

89,290 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,150 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 99,915 పలికింది. బంగారం ధర గడచిన మూడు సెషన్లుగా తగ్గుతూ వస్తోంది. ఆల్ టైం రికార్డ్ స్థాయి 92000 చూస్తే బంగారం ధర దాదాపు 3 వేల రూపాయలు తగ్గింది. ఇదే ట్రెండు కొనసాగినట్లయితే బంగారం ధర మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. కాగా బంగారం ధరలు ఇప్పటికి ఆల్ టైం రికార్డుకు సమీపంలోనే ఉన్నాయి. బంగారం ధర పెరగడం లేదా తగ్గడం అనేది అంతర్జాతీయ మార్కెట్ పైన ఆధారపడి ఉంటుంది. సాధారణంగా స్టాక్ మార్కెట్లో పతనం అయినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. అదే సమయంలో స్టాక్ మార్కెట్ లాభపడితే బంగారం విలువ తగ్గుతుంది. దీనికి తోడు ప్రస్తుతం అమెరికా డాలర్ విలువ పుంజుకుంటోంది. ఈ కారణంగా కూడా బంగారం విలువ తగ్గుతుంది.

ఎప్పుడైతే డాలర్ విలువ పెరుగుతుందో అప్పుడు బంగారం ధర తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా విడుదల చేసే ట్రెజరీ బాండ్ల పైన పెట్టుబడి పెడుతుంటాయి. డాలర్ బలపడ్డప్పుడల్లా స్థిరమైన ఆదాయం అందించే అమెరికా ట్రెజరీ బాండ్ల పైన ఇన్వెస్టర్లు ఎక్కువగా డబ్బు పెడుతుంటారు. ఇందుకోసం బంగారంలో పెట్టిన పెట్టుబడిలో ఉన్న సైతం వెనక్కు తీసుకుంటారు. దీని కారణంగా బంగారం ధర తగ్గుతుంది. అటు బంగారం ధర పెరగడం లేదా తగ్గడం అనేది అంతర్జాతీయంగా తీసుకునే పరిణామాల వల్లనే నిర్ణయం జరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధర స్వల్పంగా తగ్గిన నేపథ్యంలో పసిడి ప్రియులకు కాస్త ఊడట కలిగింది అని చెప్పవచ్చు ఎందుకంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేస్తే వారికి డబ్బు ఆదా అవుతుంది. ఇదిలా ఉంటే బంగారు ఆభరణాలు ప్రస్తుతం కొనుగోలు చేసే వారికి పెరిగిన ధరలు ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ కారణంగా రిటైల్ మార్కెట్లో కూడా 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర కూడా భారీగా పెరిగింది ఆభరణాల మార్కెట్లో పసిడి నగలు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా తగ్గింది. అయితే రిటైల్ మార్కెట్లో డిమాండ్ తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లకు మాత్రం బంగారానికి డిమాండ్ భారీగా ఉంది. దీంతో ధర పెరగడానికి దోహదపడుతోంది

Related posts

Soundbar:5 వేల సౌండ్ బార్ కేవలం రూ.1649కే.

Xloro News

ఇంకా 11 రోజులు మాత్రమే… ₹1.5 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం మిస్ అవ్వకండి…

Xloro News

1 లక్ష పెట్టుబడితో 60,000 రూపాయలు వరకూ ఆదాయం…ఈ సూపర్ సీజనల్ బిజినెస్ ఏదో తెలుసుకోండి…

Xloro News

Leave a Comment