Cinema - OTT

Chhorii 2: ఒళ్ళు గగుర్పొడిచేలా ఛోరీ -2 టీజర్

నుష్రత్ భరూచ్ఛా ప్రధాన పాత్ర పోషించిన ‘ఛోరీ’ చిత్రంకు సీక్వెల్ సిద్థమైంది. ఈ సినిమా ద్వితీయ భాగంలో సోహా అలీఖాన్ సైతం జత కలిసింది. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

బాలీవుడ్ నటి నుష్రత్ భరూచ్చా (Nushrratt Bharuccha), సోహా అలీ ఖాన్ (Soha Ali Khan) కీలక పాత్రలు పోషించిన ‘ఛోరీ -2’ (Chhorii-2) చిత్రం టీజర్ విడుదలైంది. 2021లో వచ్చిన హారర్ మూవీ ‘ఛోరీ’కి ఇది సీక్వెల్. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఓ తల్లి తన కూతురును ఎలా కాపాడుకుందనే అంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ‘మరోసారి అదే స్థలం, అదే ప్రమాదం, అదే భయం’ అంటూ వీక్షకులను భయపెట్టేలా తాజా టీజర్ మొదలైంది. మూఢాచారాల కారణంగా తనువు చాలించిన కొన్ని ఆత్మల ఘోష ఈ టీజర్ లో కనిపిస్తోంది. అలాంటి ఆత్మలు ఓ తల్లికి ఎలాంటి సందేశాన్ని పంపాలనుకున్నాయి, వాటి మధ్య కోల్పోయిన తన కూతురును ఆ తల్లి ఎలా తిరిగి దక్కించుకుందనేదే ఈ సినిమా ప్రధానాశంగా అనిపిస్తోంది. గష్మీర్ మహాజని, సౌరభ్ గోయెల్, పల్లవి అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను విశాల్ ప్యూరియా తెరకెక్కించారు. టి. సీరిస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించారు. ఏప్రిల్ 11 నుండి ఈ హారర్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Related posts

టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతున్న కీర్తి సురేష్! నితిన్ ‘ఎల్లమ్మ’ తర్వాత విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్థన్‌’లోనూ..

Xloro News

ఈ సినిమాలు చూస్తే.. మీరూ కోర్టులో కూర్చున్నట్లే

Xloro News

Top 3 OTT Films: ఓటీటీలో దుమ్ము రేపుతున్న 3 సినిమాలు.. ఈ వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే

Xloro News

Leave a Comment