Crime News

వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారంలో రాంసింగ్, సునీత, నర్రెడ్డిలపై వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసులో అదనపు డాక్యుమెంట్లను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌లో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును (YS Viveka Murder Case) వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేశారని ఏపీ ప్రభుత్వం (AP Govt) తెలిపింది. దీనిపై సుప్రీం కోర్టులో అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఎంపీ అవినాష్ రెడ్డి మార్గదర్శకత్వంలోనే సీబీఐ అధికారి రాంసింగ్, సునీత, నర్రెడ్డిలపై కేసు నమోదు చేశారని అందులో పేర్కొంది. వైఎస్ వివేకా హత్య కేసును ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసేందుకు కుట్ర జరిగిందని ఏపీ సర్కార్ వివరించింది. సుప్రీంలో దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది.

రాంసింగ్, సునీత, నర్రెడ్డిలపై వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసులో అదనపు డాక్యుమెంట్లను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌లో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సునీతా, నర్రెడ్డి రాజశేఖరరెడ్డిలను కూడా కుట్రకోణంలో భాగంగా ఈ కేసులో ఇరికించాలని చూశారని పేర్కొంది. రాంసింగ్‌పై కేసు పెట్టినప్పుడు ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి.రాజు ఫ్రోపెషనల్‌గా కేసును విచారించలేదని తెలిపింది. తనను అవినాష్ రెడ్డి బెదిరించినట్లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి. రాజు అంగీకరించినట్లు పిటీషన్‌లో ఏపీ ప్రభుత్వం చెప్పింది. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె. రాజేశ్వరరెడ్డి, ఏఎస్‌ఐజి. రామకృష్ణారెడ్డిలే ప్రధాన పాత్రదారులని.. వారిద్దరే ఈ కేసు మొత్తాన్ని నడిపించారని సర్కార్ తెలిపింది.

ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, సాక్ష్యులను విచారించినట్లు దొంగ వాంగ్మూలాలు పుట్టించడం, చార్జిషీటు దాఖలు చేయడం … ఇలా ప్రతి ఒక్కటీ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె. రాజేశ్వరరెడ్డి, ఏ ఎస్ ఐ జి. రామకృష్ణారెడ్డిలే చేశారని పిటిషన్‌లో తెలిపింది. ఎంవీ కృష్ణారెడ్డి చెప్పిన వాటిల్లో ఏ ఒక్కదానికీ సరైన ఆధారాలను చూపలేకపోయారని.. అసలు ఎంవీ కృష్ణారెడ్డిని రాంసింగ్ ఎప్పుడూ విచారించలేదని చెప్పింది. తనను రాంసింగ్ హింసించి, థర్డ్ డిగ్రీ ఉపయోగించి వైఎస్ అవినాష్, ఆయన కుటుంబసభ్యులకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ తీసుకున్నారని ఎంవీ కృష్ణారెడ్డి చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటీ నిజం లేదని వెల్లడించింది. సాక్ష్యులను విచారించకుండానే విచారించినట్లు చార్జిషీటును తయారు చేశారని తెలిపింది. ఏఎస్‌ఐజి రామకృష్ణారెడ్డి నివాసంలోనే తతంగం అంతా పూర్తి చేశారని.. కేవలం 12 రోజుల్లోనే కట్టు కథలన్నీ అల్లి రాంసింగ్, సునీత, నర్రెడ్డి పైన కేసు నమోదు చేశారని పిటిషన్‌లో తెలిపింది.

తన ఫిర్యాదుకు మద్దతునిచ్చే ఏ ఒక్క ఆధారాన్నీ ఎంవీ కృష్ణారెడ్డి సమర్పించలేకపోయారని పేర్కొంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి. రాజు అసలు ఎక్కడికీ వెళ్లకుండానే రిపోర్డు తయారు చేశారని.. అదంతా ఈ ఇద్దరు పోలీసు అధికారులు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె. రాజేశ్వరరెడ్డి, జి.రామకృష్ణారెడ్డిలే చూసుకున్నారని చెప్పింది. సాక్ష్యులు చాలా మంది తాము అసలు స్టేట్‌మెంట్ ఇవ్వలేదని విచారణలో తెలిపారని వెల్లడించింది. కేసు డైరీలోని పత్రాలపై సంతకం చేయడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి.రాజు నిరాకరించినప్పుడు ఆయనను ఏఎస్ ఐ రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ అదనపు ఎస్పీ రాజేశ్వరరెడ్డిలు అప్పటి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారని.. అక్కడ అవినాష్ రెడ్డి తమ సూచనలు పాటించకపోతే తీవ్ర పరిణామలు ఉంటాయని ఐవో జి. రాజును బెదిరించినట్లు పేర్కొంది. రిటైర్డ్ పోలీసు అధికారులతో కుమ్మక్కై అవినాష్ రెడ్డి ఆయనను ఆయన సహచరులను వివేకా హత్య కేసు నుంచి విముక్తి పొందేందుకు పన్నిన కుట్ర అని స్పష్టంగా అర్ధం అవుతుందని అదనపు అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

ఎఫ్‌ఐఆర్ ఇండెక్స్‌లో ఈ కేసు డిటైల్స్‌ను నమోదు చేయకూడదని కూడా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె. రాజేశ్వరరెడ్డి, ఏఎస్‌ఐజి. రామకృష్ణారెడ్డిలు బెదిరించినట్లు జి. రాజు అంగీకరించారు. 15.12.2023, 17.12.2023న వెంకట కృష్ణారెడ్డిని ఇనస్పెక్టర్ జి.రాజు విచారించనే లేదని… అసలు వెంకట కృష్ణా రెడ్డి పోలీసు స్టేషన్‌కే రాలేదని… సీసీ టీవిలో చాలా స్పష్టంగా తెలుస్తోందని ప్రభుత్వం వెల్లడించింది. వివేకా పీఏ వెంకట కృష్ణారెడ్డిని రాంసింగ్ విచారించలేదనడానికి సీసీటీవీ పుటేజ్‌లతో పాటు పలు సాక్ష్యాలను ఏపీ ప్రభుత్వం బయటపెట్టింది. వెంకట కృష్ణారెడ్డి చెప్పినవన్నీ కట్టుకథలేనని కొత్త ఐవో బి.మురళి స్పష్టం చేశారు.

Related posts

SSC Exams : టీచర్లు దగ్గరుండి చూచిరాత.. పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్.. కారణం అదే!

Xloro News

పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియురాలిని హత్య చేసిన పూజారి

Xloro News

మాధవి మర్డర్ కేసులో బిగ్ అప్డేట్.. బట్టలు తీసి బాత్రూంలోకి లాక్కెళ్లి!

Xloro News

Leave a Comment