Business

బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి UPI కొత్త రూల్స్.. మీ బ్యాంకు రూల్స్ మారబోతున్నాయి.

యూపీఐ (UPI) వాడుతున్నారా? వచ్చే వారం ఏప్రిల్ 1 నుంచి యూపీఐ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) బ్యాంకులు, UPI యాప్‌ల కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి

ఈ నిబంధనల ప్రకారం.. బ్యాంకులు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లు ప్రతి వారం యూపీఐ యూజర్ల మొబైల్ నంబర్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. తద్వారా తప్పుడు లావాదేవీలు, భద్రతా సంబంధిత సమస్యలను నివారించవచ్చు. అంతేకాదు.. యూపీఐ ఐడీ కేటాయించే ముందు యూజర్ల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసింది.

NPCI సర్క్యులర్ ప్రకారం.. యూపీఐ యూజర్లు వాడి పడేసిన ఫోన్ నంబర్‌లను బ్యాంకులు డిలీట్ చేయనున్నాయి. యూపీఐ యూజర్లు 31 మార్చి 2025 లోపు తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ యాక్టివ్ అయిన మొబైల్ నంబర్లు అంటే.. కస్టమర్ల మొబైల్ నెంబర్లు ఇన్‌యాక్టివ్ ఉంటే.. బ్యాంకుల డేటాబేస్‌లో క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని సర్క్యులర్ పేర్కొంది.

దీన్ని కనీసం వారానికోసారి చేయాల్సి ఉంటుందని సర్క్యులర్ పేర్కొంది. బ్యాంక్, PSP/TPAP డేటాబేస్‌లలో పనిచేయని మొబైల్ నంబర్లను తొలగించి కొత్త మొబైల్ నంబర్లతో అప్‌డేట్ అనేక సమస్యలను నివారించవచ్చనని NPCI సర్క్యులర్ పేర్కొంది.

బ్యాంకులు, PSP యాప్ మొబైల్ నంబర్ క్యాన్సిల్ లిస్టు/డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ (MNRL/DIP)ని ఉపయోగించుకోవాలి. కనీసం వారానికోసారి క్రమం తప్పకుండా వారి డేటాబేస్‌ను అప్‌డేట్ చేయాలి. ఇన్ యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్లను తొలగించడ ద్వారా బ్యాంక్, PSP/TPAP డేటాబేస్‌లలో అనేక సమస్యలను నివారించవచ్చు.

యూపీఐ నంబర్‌ను సీడింగ్ లేదా పోర్ట్ చేసేందుకు యూపీఐ యాప్ డిఫాల్ట్‌ కోసం చెక్ అవుట్, ఆప్ట్-ఇన్‌ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆపై యూజర్ సమ్మతిని పొందాలి. యూపీఐ యాప్ తప్పుదారి పట్టించే మెసేజ్‌లను నమ్మొద్దు.

ఎట్టి పరిస్థితుల్లోనూ లావాదేవీకి ముందు లేదా సమయంలో అనుమతించకూడదు. యూపీఐ నంబర్‌ను సీడ్ చేయడం లేదా పోర్టింగ్ చేయడం ద్వారా కమ్యూనికేషన్‌లు తప్పుగా కమ్యూనికేషన్ చేయకుండా నిరోధించవచ్చు.

ఎన్‌పీసీఐ మ్యాపర్ రెస్పాన్స్ టైమ్ లేకపోతే PSP యాప్ స్థానికంగా నంబర్‌ను పరిష్కరించగలదు. ఇలాంటి పనులను నెలవారీగా NPCIకి PSP యాప్ రిపోర్టు చేస్తుంది. జూలై 16, 2024న యూపీఐ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. యూపీఐ నంబర్‌ల కోసం మల్టీ వర్కింగ్ గ్రూప్ చర్చలు జరిగాయి.

Related posts

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ షురూ.. ధర రూ.79,999 మాత్రమే

Xloro News

Airtel చీపెస్ట్ ప్లాన్.. 2.5GB డేటాతో పాటు 250+ టీవీ ఛానెల్‌లు

Xloro News

లోన్ EMI చెల్లించే వారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గింపు

Xloro News

Leave a Comment