Andhrapradesh
మండలంలోని సాగునీటి సమస్యలపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలి….సీపీఎం
నేటి భారత్ -/ దేవనకొండ :
మండలంలో సాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రధాన రాజకీయ పార్టీల వైఖరి వెల్లడించాలని సిపిఎం జిల్లా నాయకులు వీరశేఖర్ డిమాండ్ చేశారు. ఆదివారం నాడు ఆ పార్టీ మండల కమిటీ సమావేశం జరిగిన అనంతరం వీరశేఖర్ మాట్లాడుతూ మండలంలో హంద్రీనీవా ప్రధాన సాగునీరు వనరుగా ఉందని 46 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా ఇప్పటివరకు అధికారికంగా పంటకాల్వల లో ద్వారా ఒక ఎకర కు కూడా సాగునీరు అందలేదని కేవలం రైతులు తమ అవసరాల రిత్యా కాలువలకు పైపుల ద్వారా మోటర్ల ద్వారా సాగునీరు సమకూర్చుకుంటున్నారని పంట కాలువల నిర్మాణంలో ప్రభుత్వాలు తీవ్రంగా నిర్లక్ష్యం చేసి మండల రైతాంగాన్ని మోసం చేస్తున్నాయని విమర్శించారు.అదేవిధంగా హంద్రీనీవా ప్రధాన కాలువ పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని కప్పట్రాళ్ల, కరివేముల ,తెర్నేకల్ గ్రామాల మధ్యలో ఉన్నటువంటి పెండింగ్ పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే గుండ్లకొండ దగ్గర హంద్రీ నీవా కు స్లుయిజ్ ఏర్పాటు చేసి గుండ్లకొండ, గుడిమరాళ్ల బంటుపల్లి, చెలమ చలమెల, బేతపల్లి, కోటకొండ, మాచాపురం,వెంకటాపురం పల్లె దొడ్డి గ్రామాలకు సాగులు ఇవ్వచ్చని ఈ సమస్యపై రాజకీయ పార్టీలు తమ వైఖరిలో వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు అబద్ధపు మాటలు, బూటకపు రాజకీయ హామీలు ఇచ్చి ఎన్నికల్లో రాజకీయ నాయకులు లబ్ధి పొందాలని చూస్తున్నారని ఈ ఎన్నికలలో మండల రైతాంగం సాగునీరు సమస్యల పట్ల చిత్తశుద్ధితో కృషి చేసే నాయకుల్ని బలపరచాలని వారు విజ్ఞప్తి చేశారు అందుకే అందరూ అభ్యర్థులు ఈ సమస్య పై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు అశోక్, సూరి, మహబూబ్ బాషా పాల్గొన్నారు.