Andhrapradesh
సీతారాం ఏచూరి మృతి వామ పక్షలకు ,దేశ రాజకీయాలకు తీరని లోటు…..సిపిఎం
సీతారం ఏచూరి గారి మృతి నేపథ్యంలో మండల కేంద్రం దేవనకొండలో ఆయనకు ఆ పార్టీ శ్రేణులు ఘన నివాళులర్పించాయి ఈ సందర్భంగా ఆ పార్టీ మండల నాయకులు అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ చదువులో గోల్డ్ మెడలిస్ట్ అయిన ఏచూరి జేఎన్టీయూ ఢిల్లీ కేంద్రంగా వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారని, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) లో చేరి అఖిల భారత అధ్యక్షులు పనిచేశారని తర్వాత జరిగిన పరిణామాలలో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా నిలబడ్డారని జైలుకెల్లారని పేర్కొన్నారు.
నిరంతరం ప్రజల పక్షాన, కార్మికులు, కష్టజీవుల పక్షాన నిలబడ్డారని , అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ సమస్యలపై విశేష అవగాహనతో ఆయా దేశాలతో సత్సంబంధాలు నేర్పడంలో క్రియాశీలక పాత్ర పోషించే వారిని ఈ నేపద్యంలోనే భారత ప్రభుత్వం తరఫున నేపాల్ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించాలని పేర్కొన్నారు.
అభ్యుదయ ,లౌకిక ప్రత్యామ్నాయ రాజకీయాలలో మొదటి తరం నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ నేటికీ విశేష పోరాటాలు చేశారని దేశంలో అన్ని రాజకీయ పార్టీ లను ఒక వేదిక పైకి తీసుకురావడంలో విజయవంతం మైన పాత్ర నిర్వహించారని పేర్కొన్నారు ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి కాకుండా దేశ రాజకీయాలకు లోటని పేర్కొన్నారు.
మూడుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉత్తమ పార్లమెంట్ సభ్యుడిగా , అత్యుత్తమ రాజకీయవేత్తగా దేశానికి విశేష సేవ అందించాలని ఆయన లేని లోటు తీర్చలేనిదని భవిష్యత్తులో శ్రామిక వర్గ పోరాటాలే ఆయనకు ఘన నివాళి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మరియు ప్రజాసంఘాల నాయకులు పాండు, వెంకటేష్, కాంతయ్య, రవి, రాముడు, రంగన్న ,తదితరులు పాల్గొన్నారు.