Andhrapradesh
కర్నూలు జిల్లాను కరువు జిల్లాకు ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలి
కరువు జిల్లాగా ప్రకటించడం కోసం జిల్లా కలెక్టర్, జిల్లా ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
కరువు తీవ్రతపై స్పందించని కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు ఉరివేసుకోవాలి
పి రామచంద్రయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
B గిడ్డయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి
K.జగన్నాథం రైతు సంఘం జిల్లా కార్యదర్శి,
కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని,భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు.ముందుగా అంబేద్కర్ భవన్ నుండి వందలాదిమంది సిపిఐ శ్రేణులు,రైతులతో ఎండిన పంట మొక్కలతో భారీ ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయం చేరుకున్నారు ఈ ర్యాలీలో వినూత్న రీతిలో ఎద్దుల బండి పై రైతు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ప్రదర్శించారు అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన మహా ధర్నాకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య అధ్యక్షత వహించారు
ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో వేసిన పత్తి, వేరుశెనగ, కంది, ఆముదం, ఉల్లి, మిర్చి, ఉద్యానవన పంటల విత్తనం వేసిన కాలం నుండే తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల మొత్తం ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని,
రైతులు ఖరీఫ్ సీజన్లో పంట పెట్టుబడి కోసం బ్యాంకుల్లో,కొంతమంది ప్రవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పుచేసి పంట వేయడం జరిగిందని, అయితే ఇప్పుడు పంట పూర్తి స్థాయిలో చెల్లి గవ్వ చేతికి రాకపోవడంతో జిల్లావ్యాప్తంగా రైతులు నిరాశలో అప్పులు ఎలా తీర్చాలని తీవ్ర ఆందోళనలో ఉన్నారని, జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న జిల్లా కలెక్టర్ గాని, స్థానిక ఎమ్మెల్యేలు గానీ, జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు.
కర్నూలు జిల్లా ప్రజలు వైసిపి ప్రభుత్వాన్ని ఎంతో ఆదరించి అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేలను,ఎంపీలను గెలిపిస్తే గెలిచినవారు పదవులు అనుభవిస్తూ, ధనార్జన ధ్యేయంగా సంపద ఏవిధంగా కూడబెట్టుకోవాలో ఆలోచిస్తున్నారు తప్ప దేశానికి అన్నం పెట్టే రైతన్న తీవ్ర నష్టాల్లో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఒక్క ప్రజా ప్రతినిధి కూడా నోరు విప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకపోవడం సిగ్గుచేటు అన్నారు, కర్నూలు జిల్లాలో ఒకేరోజు హెబ్బటం,పి కోటకొండ గ్రామాలలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఒక్క ప్రజా ప్రతినిధి కూడా పంటలు పరిశీలన చేయకపోవడం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించకపోవడం దుర్మార్గమన్నారు,
ఈ మహా ధర్నా నుండి రైతులను ఒకటే కోరుకుంటున్నామని ఏ ఒక్క రైతు కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, మీకు అండగా సిపిఐ,ఏ.పీ.రైతు సంఘాలు అండగా ఉన్నాయని, అందరం కలిసికట్టుగా పోరాడి మన సమస్యలు పట్టించుకోని జిల్లా ప్రజా ప్రతినిధులకే గోరి కడదాము తప్ప దేశానికి అన్నం పెట్టే మనం ఆత్మహత్య చేసుకోవద్దని వారు పిలుపునిచ్చారు.
ఈ మహా ధర్నా రైతు సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా జరుగుతుందని, ఇప్పటికైనా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి కరువు జిల్లాగా ప్రకటించి ఖరీఫ్ సీజన్లో రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు మొత్తం మాఫీ చేయాలని, అదేవిధంగా వేసిన పంటలు మొత్తం ఎండిపోవడంతో పత్తి వేరుశనగ ఆముదం కంది పంటలకు ఎకరానికి 40 వేల రూపాయలు నష్టపరిహారం, ఉల్లి,మిర్చి ఉద్యానవన పంటలకి ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, కరువును దృష్టిలో పెట్టుకొని జిల్లాలో వెంటనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల ప్రారంభించి వలసల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా సిపిఐ,ఏ.పీ, రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రైతులను కూడగట్టి ప్రజా ప్రతినిధులను జిల్లా అధికారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.
తీవ్ర ఎండలో రైతు సమస్యల పైన ఆందోళన చేస్తుంటే, జిల్లా కలెక్టర్ వారి సమస్య వినేందుకు బయటకు రాకపోవడంతో సిపిఐ నాయకులు కలెక్టర్ గారికి విన్నవించేందుకు గేట్లు తీసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని వారించి, డిఆర్.ఓ బయటకు రావడంతో ఉదృత వాతావరణం సద్దుమణిగింది. అనంతరం డిఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ ధర్నా కార్యక్రమంలో ఏ.పీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. జగన్నాథం, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిలు ఎస్.ఎన్.రసూల్, ఎస్. మునెప్ప,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.లక్ష్మిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, అజయ్ బాబు, నబి రసూల్, రామకృష్ణారెడ్డి , రాజా సాహెబ్ , పంపన్న గౌడ్, రంగన్న, విరుపాక్షి, చంద్రశేఖర్,భాస్కర్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు గిడ్డమ్మ , ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు, కారుమంచి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమన్న, షాబీర్ భాష, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి నాగరాజు,, నగర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, బొంతిరాల్ల గ్రామ సర్పంచ్ రవి మోహన్, జిల్లా సమితి సభ్యులు సుదర్శన, రాజు, అమీనాభి, నరసరావు, సుల్తాన్ రామాంజనేయులు మారెప్ప నాగప్ప చిన్నన్న,,ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు శరత్, రంగస్వామి, విజయేంద్ర, దస్తగిరి, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు బిసన్న, గిరి మల్లప్ప పెద్దయ్య, రాజు, రమేషు, వందల సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.