Andhrapradesh
స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ, కుట్టు మిషన్లు అందిస్తున్న నారా లోకేష్
నారా లోకేష్ సహకారంతో 50 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ
శిక్షణ పొందిన “27”వ బ్యాచ్ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ
కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ చేసిన నియోజకవర్గ తెలుగు మహిళ విభాగం నాయకులు
మంగళగిరి టౌన్, అక్టోబర్ 16: స్వయం ఉపాధి కల్పన, ఆర్థిక స్వావలంబనే స్త్రీశక్తి ధ్యేయం అని నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి అన్నారు. స్త్రీ శక్తి ద్వారా మంగళగిరి పట్టణం, మంగళగిరి రూరల్ మండలాల్లో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మంగళగిరి ఎమ్మెస్సెస్ భవన్ లో సోమవారం సర్టిఫికెట్లు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. 27వ బ్యాచ్‌లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన 50 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. మిషన్లు అందుకున్న లబ్ధిదారులు నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ మహిళలు తమ స్వంత కాళ్ళపై నిలబడి కుటుంబ పోషణకు చేదోడు వాదోడుగా ఉందేందుకు నారా లోకేష్ ఆర్థిక సహకారంతో అందిస్తున్న కుట్టు మిషన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నియోజకవర్గంలోని మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంభన సాధించాలన్న ఉద్దేశ్యంతో నారా లోకేష్ స్త్రీశక్తిని నెలకొల్పినట్లు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తూనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లు, అమ్మకు వందనం కింద రూ.15వేలు, ఇంట్లోని మహిళలందరికి నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సహాయం అందుతుందన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, యలమంచిలి పద్మజ, వాసా పద్మ, సింహాద్రి బేబీరాణి, దామర్ల పద్మజ, సారమేకల మాధవీ తదితరులు పాల్గొన్నారు