Andhrapradesh
సీబీఐ, ఎఫ్.బీఐ కాదు అంతర్జాతీయ స్థాయిలో ఉండవల్లి ఏ విచారణ కోరుకున్నా మాకు అభ్యంతరం లేదు
లక్షల మందికి ఉపాధి కల్పించిన స్కిల్ డెవలప్మెంట్ ను స్కామ్ అంటున్న ఉండవల్లికి ఏపీలో జరుగుతున్న మద్యం, మైనింగ్ కుంభకోణాలు కనిపించడం లేదా
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై ఉండవల్లి సీబీఐ విచారణ కోరడం వెనుక ఎవరున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు
వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు నాయుడిని అవినీతిపరుడిగా చిత్రీకరించలేరు. ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారు
వెంకటాచలం మండలం చవటపాళెంలో నిర్వహించిన ప్రజావేదికలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు పేరుతో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినా ఈ రోజుకీ ఈసమెత్తు అవినీతి జరిగినట్టు చూపలేకపోయారు
36 మందిపై కేసు బనాయించిన తర్వాత 37వ నిందితుడిగా చంద్రబాబు నాయుడిని చేర్చారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు పెట్టారు
ఈ రోజుకీ ఫలానా లావాదేవీలో అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారు. మొదట 3 వేల కోట్లు, ఆ తర్వాత 370 కోట్లు అన్నారు
చివరకు రూ.27 కోట్లు పార్టీ ఫండ్ కింద వచ్చిందని అడిషనల్ అడ్వకేట్ జనరల్ అన్నారు. ఆ రూ.27 కోట్లు కూడా ఎలక్ట్రోరల్ బాండ్లు
వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీబీఐ విచారణ జరగాలని మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిల్ వేశారు
సీబీఐ, సీఐఏ, ఎఫ్.బీ.ఐ కాకపోతే అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఏ విచారణను ఉండవల్లి కోరినా మాకు అభ్యంతరం లేదు
ఏ విచారణ జరిపించుకున్నా ఒక్క అవినీతి రూపాయి జరిగినట్టు చూపించే అవకాశమే లేదు
జగన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డుబెట్టుకుని రూ.43 వేల కోట్ల అక్రమాస్తులు కూడగట్టినట్టు సీబీఐ, ఈడీ ఆధారాలతో సహా నిరూపించాయి.
ఆ కేసుల్లో జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డితో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా జైలు జీవితం గడిపివచ్చారు
ప్రజాప్రతినిధులపై నమోదైన అవినీతి కేసుల్లో విచారణ ఏడాదిలో పూర్తికావాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా పదేళ్లుగా బెయిల్ పై తిరుగుతున్నారు
మేధావినని చెప్పుకునే ఉండవల్లికి అవి కనిపించడం లేదా..అలాంటి వాటిని ప్రశ్నించలేరా
కరెన్సీ నోటుకు తప్ప డిజిటల్ గా ఏ రూపంలో మద్యం విక్రయించబోమని జగన్ రెడ్డి పట్టుబట్టి భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారు
ఏపీ ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం అత్యంత ప్రమాదకరమని ప్రకటించిన ఉండవల్లి దానిపై ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదు
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో రూ.100 మద్యం స్కామ్ జరిగిందని ఎందరో ప్రముఖులతో పాటు డిప్యూటీ సీఎంని సైతం ఇప్పటికీ జైలులో పెట్టివున్నారు
ఏపీలో మద్యం, ఇసుకలో కలిసి నెలకు రూ.500 కోట్ల వరకు స్కాం జరుగుతోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఇది కనిపించడం లేదా
రాష్ట్రంలో ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యాన్ని ఓ వారం పాటు తాగే దమ్ము, ధైర్యం వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఉందా
మీరు మాత్రం విలాసవంతంగా గడుపుతారు. పేదలు మాత్రం నాసిరకమైన మద్యం తాగి చావాలి
14 ఏళ్లుగా రాష్ట్రానికి సీఎంగా సేవలు అందించి, నిజాయతీపరుడిగా గుర్తింపుపొందిన నారా చంద్రబాబు నాయుడిని వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుంటే ఉండవల్లికి ఆనందంగా ఉందా
రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, భూదందాలు, కక్షసాధింపులు, వేధింపులు, దొంగ కేసులేమీ ఉండవల్లికి కనిపించడం లేదా
2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించిన స్కిల్ డెవలప్మెంట్ పై సీబీఐ విచారణ కోరుతారా
ఏ విచారణ కోరినా వెంట్రుక కూడా పీకలేరు. చంద్రబాబు నాయుడిని అవినీతిపరుడిగా చిత్రీకరించాలంటే మీ తాతలు దిగివచ్చినా సాధ్యం కాదు
ఇప్పటి వరకు ఒక పెద్దమనిషిగా చెలామణి అయిన ఉండవల్లి ఎవరి ప్రోద్బలంతో ఇలా చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు
జగనన్న కాలనీల పేరుతో హడావుడి చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టడం లేదు
పేదలకేమో ఇరుకిరుకు ఇళ్లు కట్టిస్తూ ముఖ్యమంత్రి కోసం రిషికొండ ప్యాలెస్ ఒక్క లెట్రిన్ కమోడ్ కోసమే రూ.25 లక్షలు వెచ్చించారట
సర్వేపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కూడా విదేశాల నుంచి కోట్ల రూపాయలతో సామగ్రి తెచ్చి విలాసవంతమైన కరోనా ప్యాలెస్ కట్టించుకున్నారు
సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు అడ్డంగా దోచేసి విలాసవంతమైన రాజభవనాలు కట్టుకుంటున్నారు. పేదలకు మాత్రం సెంటు స్థలంలో ఇల్లులంట
రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుంది.