Andhrapradesh

పేదలకు భరోసా ముఖ్యమంత్రి సహాయనిధి…MLA శిల్పా రవిరెడ్డి

Published

on

128 Views

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు భరోసా నిస్తుందని నంద్యాల MLA శిల్పా రవిరెడ్డి అన్నారు. మంగళవారం నంద్యాల ఎమ్మెల్యే స్వగృహంలో ముఖ్యమంత్రి సహాయనిధికి అర్హులైన లబ్ధిదారులు నంద్యాల నియోజకవర్గ పరిధిలో ఉన్న వారికి మొత్తం 4.85000/రూపాయలు అందులో షేక్ హమద్ భాను 50.000/బెక్కం హేమలత 65,000/ మంటి హుషేని 65,000/ కొనుదుల లాలితమ్మ 75,000/ బోరెడ్డి రాజేశ్వరి 60,000/ సిరియపు రెడ్డి వీరాదేవి 1,70,000/ రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంలోనికి రాని రోగాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అనేక రోగాలకు ఆపరేషన్లను నిర్వహించడం జరిగిందని తెలిపారు. పేదవారి ఆరోగ్యానికి, జీవితాలకు అండగా నిలుస్తానని చెప్పిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుండి ఆర్థిక బోరాసాన్ని కల్పిస్తున్నాడని తెలిపారు. ఆరోగ్యశ్రీలో 1000కి పైగా రోగాలను చేర్చడం జరిగిందని, అంతేకాకుండా మిగతా రోగాలకు సీఎంఆర్ఎఫ్ నుండి సహాయమందించడం జరుగుతుందన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, దేశం సుధాకర్ రెడ్డి కౌన్సిలర్స్ మేష చంద్రశేఖర్ , బాసిద్ ,కిరణ్ కుమార్, టివి రమణ,గాన్ని కరీం ,ఆంధ్ర మెడికల్ రమేష్, రామ సుబ్బారెడ్డి ,కాసిం, శివనాగిరెడ్డి, రామారెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version