ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ గార్కి ఆసుపత్రిల్లో పని చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్స్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు మొదలైన కాంట్రాక్టు వర్కర్స్ కి 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా, జీతాలు పెంచకుండా, పిఎఫ్ డబ్బులు చెల్లించకుండా, ఈ.ఎస్.ఐ కార్డులు ఇవ్వకుండా, సెలవులు లేకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్న కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలి.. తక్షణమే మీరు కలుగచేసుకుని 3 నెలల బకాయి జీతాలు ఇప్పించి సమస్యలు పరిష్కారం చేసి సామరస్య వాతావరణం కలిగించాలని లేనియెడల ఇంత వరకు జరుగుతున్న శాంతియుత పోరాటం మరింత ఉధృతం చేస్తామని ఆ తరువాత జరిగే పరిణామాలకు అధికారులు, పాలకులే భాధ్యత వహించాలని కలెక్టర్ గార్కి తెలపడం జరిగింది.