Telangana
ఈనెల 20వ తేదీన సిపిఐ మండల, పట్టణ జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయండి……బి.అయోధ్య (సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు)
ఈనెల 20వ తేదీన శుక్రవారం రోజు మణుగూరు సిపిఐ కార్యాలయంలో మణుగూరు మండల పట్టణ జనరల్ బాడీ సమావేశం ను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య, పిలుపునిచ్చారు.మంగళవారం నాడు సిపిఐ కార్యాలయంలో జరిగిన ముఖ్య సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఇచ్చినటువంటి హామీలు అర్హులైనటువంటి వారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు, ఆసరా పెన్షన్లు, వృద్ధాప్య ,వికలాంగుల పెన్షన్లు ,దళితులకు మూడెకరాల భూమి ,దళిత బంధు పథకం, బీసీ లోన్లు, గృహలక్ష్మి పథకం ఇలా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు ఏమిరా చేరాయి అని దీనిపై గ్రామాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల ద్వారా నేరుగా తెలుసుకోవడానికి జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఈ సమావేశానికి పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, నాయకులు ,అన్ని వర్గాల ప్రజలు హాజరై జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పినపాక నియోజకవర్గ కార్యదర్శి సరెడ్డి పుల్లారెడ్డి, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్న లక్ష్మీకుమారి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మీనారాయణ,మణుగూరు మండల కార్యదర్శి జంగం మోహన్ రావు, పట్టణ కార్యదర్శి దుర్గేల సుధాకర్, ఏఐటీయూసీ మండల అధ్యక్ష కార్యదర్శిలు తోట రమేష్, అక్కి నరసింహారావు, జిల్లా సమితి సభ్యులు ఎస్కే సర్వర్, గిరిజన సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు కుటుంబరావు, వార్డు మెంబర్ కనితి సత్యనారాయణ, చెక్కుల రాజబాబు, మంగి వీరయ్య, ఎస్వీ నాయుడు, కన్నబోయిన ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.